బంగ్లాలను వదలమంటోన్న మాజీలు.. చర్యలకు సిద్ధమైన అధికారులు

గత ప్రభుత్వ హయాంలో బంగ్లాలను పొందిన మాజీ ఎంపీలు ఇప్పటికీ వాటిని ఖాళీ చేయడం లేదట. కొత్త ఎంపీలకు వసతి సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఖాళీ చేయాలని లోక్‌సభ ప్యానెల్ సూచించినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఇంకా 82మంది తమ నివాసాలను ఖాళీ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వారితో ఖాళీ చేయించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ గత […]

బంగ్లాలను వదలమంటోన్న మాజీలు.. చర్యలకు సిద్ధమైన అధికారులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 16, 2019 | 7:39 AM

గత ప్రభుత్వ హయాంలో బంగ్లాలను పొందిన మాజీ ఎంపీలు ఇప్పటికీ వాటిని ఖాళీ చేయడం లేదట. కొత్త ఎంపీలకు వసతి సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఖాళీ చేయాలని లోక్‌సభ ప్యానెల్ సూచించినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఇంకా 82మంది తమ నివాసాలను ఖాళీ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వారితో ఖాళీ చేయించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ గత నెల 19న సుమారు 200మంది మాజీ ఎంపీలకు బంగ్లాలు ఖాళీ చేయాలని సూచించింది. ఖాళీ చేయకుంటే నీరు, విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరించగా.. పలువురు నివాసాలను ఖాళీ చేశారు. అయినా ఇంకా 82మంది తమకు కేటాయించిన బంగ్లాలోనే ఉంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వారిపై హౌసింగ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీల తీరుపై కఠిన చర్యలుంటాయని కమిటీకి చెందిన కొందరు అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ బంగ్లాలను వదలని మాజీ ఎంపీలపై ఆక్రమణదారుల చట్టం కింద ఖాళీ చేయిస్తామని.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాక విద్యుత్, మంచినీరు, వంట గ్యాస్ వంటి సదుపాయాలు నిలిచిపోతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే మాజీ ఎంపీలు తమ బంగ్లాలను ఖాళీ చేయని నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు తాత్కాలిక భవనాలను కేటాయించారట అధికారులు.