
కొంతమంది క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతుంటారు. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. దీంతోపాటు తగిన మూల్యం కూడా చెల్లించుకోకతప్పదు.. తాజాగా.. ఓ యువకుడు ఫుల్లుగా తాగి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. మద్యం మత్తులో తన మర్మాంగాన్ని తానే.. కొడవలితో కోసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స కోసం హుణసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు అతనికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుణసూరు తాలూకా తొండాళుకు చెందిన రాజశెట్టి (40) అనే వ్యక్తి.. శనివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లే దారిలో ఎదురైన గ్రామస్థులతో గొడవ పడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని మందలించి, ఇంటి దగ్గర వదలిపెట్టి వెళ్లారు.
అందరూ దూషించారని మనస్థాపం చెందిన అతను.. గట్టిగా కేకలు వేశాడు. అనంతరం క్షణికావేశంలో కొడవలి తీసుకుని.. తన మర్మాంగాన్ని తానే కోసుకుని కిందపడిపోయాడు.
గమనించిన కుటుంబసభ్యులు.. స్థానికుల సహాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుణసూరు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..