కేసుల బదులు బీజేపీ నేత కపిల్ మిశ్రాకు వై ప్లస్ సెక్యూరిటీ

ఢిల్లీలో ఇటీవల హింసను, అల్లర్లను రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది.

కేసుల బదులు బీజేపీ నేత కపిల్ మిశ్రాకు వై ప్లస్ సెక్యూరిటీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 03, 2020 | 11:18 AM

ఢిల్లీలో ఇటీవల హింసను, అల్లర్లను రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. (నిజానికి ఈయనపై ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేసి, కేసులు నమోదు చేయాలని విపక్షాలు డిమాండు చేస్తున్నాయి) తనకు ప్రాణ హాని ఉందని మిశ్రా చెపుకోవడంతో ప్రభుత్వం ఈ సెక్యూరిటీ కల్పించింది. ఈ కేటగిరీ కింద ఈయనకు 24 గంటలూ భద్రత ఉంటుంది. సాయుధులైన గార్డులు నీడలా మిశ్రాను వెన్నంటే ఉంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఏఏను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులను, ఒక వర్గం వారిని ఉద్దేశించి పరోక్షంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన మిశ్రా పైన , ఇతర బీజేపీ నేతలపైనా ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేయాలని  ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనను హతమారుస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల తనకు భద్రత పెంచాలని మిశ్రా సర్కార్ ను కోరారు. ఈయనతో బాటు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ వంటి ఇతర కమలం పార్టీ నేతలు కూడా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. ఇలా ఉండగా….  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఈ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ   కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలతో హింసను రెచ్చగొట్టారని, అందువల్ల వీరిపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించవలసిందిగా కోరుతూ బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మీ వైఖరేమిటో తెలపాలని కోర్టు….  కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలపై కోర్టులోనే తాము దీటైన జవాబు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు