Election Results 2024: మారిన ట్రెంట్స్.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ.. రెజ్లర్ వినేష్ ఫొగాట్ వెనుకంజ
క్షణం క్షణం ఉత్కంఠ.. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యాలు మారుతున్నాయి.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది.. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
క్షణం క్షణం ఉత్కంఠ.. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యాలు మారుతున్నాయి.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది.. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. ఇతరులు 6 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం చూస్తే.. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది.. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు వెనుకంజలో కొనసాగుతున్నారు. జులానా నియోజకవర్గంలో రెజ్లర్ వినేశ్ పోగట్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నాలుగు రౌండ్లు ముగిసేవరకు యోగేశ్ ప్రస్తుతం మూడువేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.
#WATCH | Haryana elections | Congress candidate from Julana, Vinesh Phogat at the counting centre in Jind
She is currently trailing from Julana Assembly constituency pic.twitter.com/OXDeMDBSXR
— ANI (@ANI) October 8, 2024
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం.. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుపై ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
కాగా.. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతోంది.. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన కాంగ్రెస్ కూటమి.. 51 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.. బీజేపీకి 25చోట్ల.. 14స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..