Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: అలాంటి విషయాల్లో న్యాయమూర్తులు రోబోల్లా ఉండకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు న్యామూర్తులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయూర్తులు.. నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పింది. కళ్లు మూసుకొని మౌన ప్రేక్షుకునిలా ఉండకూడదని.. ఓ రోబో లాగా వ్యవహరించకూడదని సూచనలు చేసింది. అయితే ఇటీవల ఓ కేసులో బిహార్‌కు చెందినటువంటి ఓ నిందితుడికి పట్నా హెకోర్టు, దిగువ న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. అయితే అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పట్నా కోర్టు మరణ శిక్షను విధించిన తీరును తప్పుబట్టింది.

Supreme Court: అలాంటి విషయాల్లో న్యాయమూర్తులు రోబోల్లా ఉండకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court of India
Follow us
Aravind B

|

Updated on: Sep 06, 2023 | 9:26 AM

సుప్రీంకోర్టు న్యామూర్తులకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయూర్తులు.. నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పింది. కళ్లు మూసుకొని మౌన ప్రేక్షుకునిలా ఉండకూడదని.. ఓ రోబో లాగా వ్యవహరించకూడదని సూచనలు చేసింది. అయితే ఇటీవల ఓ కేసులో బిహార్‌కు చెందినటువంటి ఓ నిందితుడికి పట్నా హెకోర్టు, దిగువ న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. అయితే అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పట్నా కోర్టు మరణ శిక్షను విధించిన తీరును తప్పుబట్టింది. అలాగే దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని చెప్పింది. ఇక చివరికి మరణదండన ఉత్తర్వులను రద్దు చేసేసింది. అలాగే శిక్షను మళ్లీ పరిశీలన చేయాలంటూ కేసును తిరిగి పట్నా హైకోర్టుకే పంపించింది. అయితే బిహార్‌లోని భాగల్పుర్ అనే జిల్లాలో 2015లో జూన్ 1 న టీవీ చూసేందుకు 11 ఏళ్ల బాలిక ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లింది.

దీంతో ఆ నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. హతమార్చాడనేది అభియోగం. ఈ అభియోగం అత్యం అరుదైనదని.. నిందితుడికి మరణశిక్షే సరైనదని విచారణ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అలాగే మరణ శిక్ష తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. ఇక ఆ నిందితుడు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటీషన్‌ను మంగళవారం రోజున జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రల ధర్మాసనం విచారణ జరిపింది. ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదిక తీసకోలేదని.. అలాగే ఈ కేసు విచారణలో అనేక లోపాలు ఉన్నట్లు ఈ ధర్మాసనం తెలిపింది. తీవ్రమైన విషయాల్లో కూడా దర్యాప్తు అధికాలు ఇలాంటి లోపాలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించింది. అప్పీలుదారుడికి వైద్య నిపుణిడితో కూడా పరీక్ష చేయించలేదని పేర్కొంది.

ఇక బాధితురాలి ఇంటికి వచ్చిన నిందితుడు.. టీవీ చూసేందుకు తన ఇంటికి రావాలని చెప్పడం ఆధారంగా హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చేయడం దిగ్భ్రాంతికరమైన విషయం అని వ్యాఖ్యానించింది. మరో కిశోరప్రాయుడు ఆ రోజు నిందితురాలి ఇంటికి వచ్చి ఆమెను తనతోపాటు తీసుకెళ్లాడని.. ఈ విషయాలన్ని సాక్షులు పోలీసులకు కూడా చెప్పినట్లు పేర్కొంది. అయితే ఈ పాయింట్ మీద దిగువ కోర్టులేవీ కూడా దృష్టిసారించకపోవడం దురదృష్టకరమైన విషయం అని చెప్పింది. అయితే దీనిపై తగిన ప్రశ్నలు అడగడం న్యాయమూర్తుల విధి అని స్పష్టం చేసింది. వారు నిష్పాక్షికంగా వ్యవహరించడంతో సహా ఏదో ఒక పక్షంపై వ్యక్తిగత అభిప్రాయాలతో తీర్పు చెప్పారని.. ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని చెప్పింది. ఆయా పక్షాలు చెప్పే సమాచారం ఆధారంగా రోబోల మాదిరిగానో… రికార్డింగ్ యంత్రాల్లాగో వ్యవహరించకూడదని చెప్పింది. అమాయకులెవరకి కూడా శిక్ష పడకూడదని పేర్కొంది. దోషులెవరూ కూడా తప్పించుకోకూడదని సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..