బీజేపీ కొత్త సారథి జె.పీ.. నడ్డా.. పార్టీ పగ్గాలు అప్పగించిన అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పీ.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రాలను పార్టీ ఎన్నికల ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఏడాది క్రితం నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.. […]
బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జె.పీ.నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయనకు నియామకపత్రాలను పార్టీ ఎన్నికల ఇన్-ఛార్జ్ రాధామోహన్ సింగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ నుంచి డా.కె.లక్ష్మణ్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఏడాది క్రితం నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే.. కాగా-తనపై తాజాగా పార్టీ అధినాయకత్వం పెట్టిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని నడ్డా పేర్కొన్నారు. ఆయనను పార్టీ మాజీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు అభి నందించారు.