AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNU గూండాలా ? విద్యార్థులా ? వాట్సాప్‌లో ‘హింస’కు ముందు…..

ఢిల్లీ జవర్లాల్ నెహ్రు యూనివర్సిటీ హాస్టళ్లు, ఆవరణలో జరిగిన హింసాకాండకు ముందు కొంతమంది తమ మొబైల్ ఫోన్ల వాట్సాప్ లో సర్క్యులేట్ చేసుకున్న మెసేజులు, ఇచ్చిపుచ్చుకున్న సమాచారం ఓ మీడియా సంస్థకు అందాయి. వీరు వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేసుకుని ఎలా ‘ రచ్ఛ’ చేయాలో ప్లాన్ వేసుకున్నారు. వీరిలో ఆరుగురి ఫోన్ నెంబర్లను ఆ సంస్థ సేకరించగలిగింది. ‘ యూనివర్సిటీలో హింసకు పాల్పడదాం.. ఎవరొచ్చినా ఆగేదిలేదు ‘అని వీరు సందేశాలు పంపుకున్నట్టు వెల్లడైంది. ‘ మేం […]

JNU గూండాలా ? విద్యార్థులా ? వాట్సాప్‌లో 'హింస'కు ముందు.....
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 06, 2020 | 5:20 PM

Share

ఢిల్లీ జవర్లాల్ నెహ్రు యూనివర్సిటీ హాస్టళ్లు, ఆవరణలో జరిగిన హింసాకాండకు ముందు కొంతమంది తమ మొబైల్ ఫోన్ల వాట్సాప్ లో సర్క్యులేట్ చేసుకున్న మెసేజులు, ఇచ్చిపుచ్చుకున్న సమాచారం ఓ మీడియా సంస్థకు అందాయి. వీరు వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేసుకుని ఎలా ‘ రచ్ఛ’ చేయాలో ప్లాన్ వేసుకున్నారు. వీరిలో ఆరుగురి ఫోన్ నెంబర్లను ఆ సంస్థ సేకరించగలిగింది. ‘ యూనివర్సిటీలో హింసకు పాల్పడదాం.. ఎవరొచ్చినా ఆగేదిలేదు ‘అని వీరు సందేశాలు పంపుకున్నట్టు వెల్లడైంది. ‘ మేం కూడా మీ గ్రూపులో చేరుతున్నాం.. మాకూ సమాచారమివ్వండి ‘ అని ఇద్దరు కోరారు. ఇందుకు.. ‘ తప్పకుండా.. ఇప్పుడు దాడి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం ? ఈ వర్సిటీని అంతా ‘ గలీజ్ ‘ చేశారు ‘ అని ఒకడు సమాధానమిచ్చాడు.

తాను ఈ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినని, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో పీ హెచ్ డీ చేస్తున్నానని చెప్పుకున్న ఒకడు.. ‘ ఎస్.. నేను ఏబీవీపీకి చెందినవాడిని.. ఈ వర్సిటీ ప్రతిష్టను కొందరు మంట గలుపుతున్నారు ‘ అని పేర్కొన్నాడట. అయితే కొన్ని గంటలకే నేను ఈ యూనివర్సిటీవాడినే గానీ ఆ సందేశాలను పోస్ట్ చేయలేదని, ఎవరో తన ఫోన్ నెంబరును దుర్వినియోగం చేశారని ఆ వ్యక్తి ఆరోపించాడట. ‘ ఈ విశ్వవిద్యాలయంలో ఎంతో ‘ ఫన్ ‘ క్రియేట్ చేశాం.. ఈ దేశ ద్రోహుల్ని కొట్టి మజా వచ్చింది. ‘ అని ఒకడు మెసేజ్ ఇచ్చాడు. వీరిలో ఒకరు తాను హర్యానా నుంచి వచ్చానంటే మరొకడు తను కేరళవాసినని, ఇంకొకడు తాను నోయిడా నుంచి వచ్చానని.. ఇలా తమ తమ ప్రాంతాలగురించి చెప్పుకున్నారు. ‘ యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్ ‘ అనే గ్రూపును వీరు క్రియేట్ చేసుకున్నట్టు వెల్లడైంది.

కేసు దర్యాప్తు ఢిల్లీ క్రైమ్ బ్రాంచికి మార్పు…

జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీలో జరిగిన హింసాకాండ తాలూకు కేసును ఢిల్లీ పోలీసు శాఖ నుంచి ఢిల్లీ క్రైమ్ బ్రాంచికి మార్చారు. అసలు ఏం జరిగిందన్న అంశంపై పోలీసులు, అధికారులు విద్యార్థులను అడిగి ఆధారాలు సేకరించనున్నారు. తాజా ఘటనపై హెచ్ ఆర్ డీ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం సిబ్బందితో సమావేశం కాబోతున్నారు. కాగా-ఈ వర్సిటీకి చెందిన సబర్మతి హాస్టల్ చీఫ్ వార్డెన్ ఆర్. మీనా రాజీనామా చేశారు. హాస్టల్ కు భద్రత కల్పించలేకపోయానని మీనా తన రాజీనామా లేఖలో మనస్తాపం వ్యక్తం చేశారు.