AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫారిన్ మీడియాకెక్కిన జెఎన్‌యు ఘటన..

జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు ఫారిన్ మీడియాకెక్కాయి. ఇండియాలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు, ప్రభుత్వానికి మధ్య వారాల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెను పరిణామాలకు దారి తీయవచ్ఛునని విదేశీ మీడియా అభిప్రాయపడింది. సవరించిన పౌరసత్వ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇండియా అంతటా వెల్లువెత్తిన నిరసనలు, ప్రదర్శనలను ఆ యా సంస్థలు గుర్తు చేశాయి. తాజ  ఘటన ఇప్పటికే విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో మరింత నిరసనలకు, […]

ఫారిన్ మీడియాకెక్కిన జెఎన్‌యు ఘటన..
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 06, 2020 | 2:10 PM

Share

జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలు ఫారిన్ మీడియాకెక్కాయి. ఇండియాలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యూనివర్సిటీలో విద్యార్థులకు, ప్రభుత్వానికి మధ్య వారాల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెను పరిణామాలకు దారి తీయవచ్ఛునని విదేశీ మీడియా అభిప్రాయపడింది. సవరించిన పౌరసత్వ చట్టానికి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇండియా అంతటా వెల్లువెత్తిన నిరసనలు, ప్రదర్శనలను ఆ యా సంస్థలు గుర్తు చేశాయి. తాజ  ఘటన ఇప్పటికే విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో మరింత నిరసనలకు, ఉద్రిక్తతకు దారి  తీసే అవకాశం ఉందని వాషింగ్టన్ లోని విల్సన్ సెంటర్ అధినేత, దక్షిణాసియా వ్యవహారాలపై గల కమిటీ సీనియర్ అసోసియేట్ మైఖేల్ కుగల్మన్ వ్యాఖ్యానించారు. స్టూడెంట్స్ కు, భారత ప్రభుత్వానికి మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇంకా పెరగవచ్చునని, సమీప భవిష్యత్తులో దీనికి పరిష్కార మార్గం కనబడడం లేదని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నవారిపై ప్రభుత్వం వహిస్తున్న ‘ రేడియో లైసెన్స్ ‘ ఉన్నత స్థాయిలో ఏ విధమైన పరిష్కారానికీ దోహదపడదని ఆయన అన్నారు. ఇండియాలో జరుగుతున్న ఈ సంఘటనలను సీనియర్ అధికారులు తనకు తెలియజేశారని మైఖేల్ చెప్పారు.

ఇది ఏబీవీపీ వారి పనే

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీకి చెందిన విద్యార్థులే ఇనుపరాడ్లు, కర్రలతో హింసకు పాల్పడ్డారని అఖిల భారత విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు ఎన్. సాయి బాలాజీ ఆరోపించారు. అయితే ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠీ ఈ ఆరోపణను ఖండిస్తూ.. ఈ దాడులకు లెఫ్టిస్ట్ స్టూడెంట్స్ యూనియన్లదే బాధ్యత అని ట్వీట్ చేశారు.  ఇలా ఉండగా…  అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖ. వీటినన్నింటినీ పట్టించుకోకుండా ఈ దేశంలో నివసిస్తున్నవారందరి ఐడెంటిటీ డేటా బేస్ సేకరణను ఏప్రిల్ నుంచి చేపట్టాలని నిర్ణయించింది.

విదేశాంగ, ఆర్ధిక మంత్రుల ఖండన

జెఎన్ యు ఘటనను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. (వీరిద్దరూ ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులే). వర్సిటీలో జరిగిన దాడులకు బీజేపీ అనుబంధ సంస్థ దేనితోనూ సంబంధం లేదని వీరు పేర్కొన్నారు.     .