Jio SpaceFiber: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అద్భుతం.. జియో స్పేస్‌ ఫైబర్‌ను పరిశీలించిన మోదీ

దీంతో దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి వేగంతో కూడిన ఇంటర్‌నెట్ సేవలను అందించనున్నారు. తాజాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌లో ఆకాష్ అంబానీ జియో స్పేస్‌ ఫైబర్‌పై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ జియో స్పేస్‌ ఫైబర్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. దేశంలోని ప్రతీ ఇంటికి ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చేలా ఈ టెక్నాలజీని..

Jio SpaceFiber: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అద్భుతం.. జియో స్పేస్‌ ఫైబర్‌ను పరిశీలించిన మోదీ
Jio Space Fiber
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 27, 2023 | 12:47 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. జియోతో టెలికం రంగంలో అద్భుతాన్ని సృష్టించిన రియలన్స్‌ ఇప్పుడు జియో స్పేస్ ఫైబర్‌ పేరుతో మరో సరికొత్త ఆవిష్కరణకు సిద్ధమైంది. ప్పటికే జియో స్పేస్‌ ఫైబర్‌ పేరుతో మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ తీసుకొచ్చిన జియో.. తాజాగా శాటిలైట్‌ ఆధారినత ఇంటర్‌నెట్ సేవలను అందించనున్నారు.

దీంతో దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి వేగంతో కూడిన ఇంటర్‌నెట్ సేవలను అందించనున్నారు. తాజాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌లో ఆకాష్ అంబానీ జియో స్పేస్‌ ఫైబర్‌పై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ జియో స్పేస్‌ ఫైబర్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. దేశంలోని ప్రతీ ఇంటికి ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చేలా ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

ఈ సేవలను పరీక్షించే క్రమంలో రియలన్స్‌ ఇప్పటికే.. గిర్ గుజరాత్, కోర్బా ఛత్తీస్‌గఢ్, నబ్రంగ్‌పూర్ ఒడిశా, ONGC-జోర్హాట్ అసోం ప్రాంతాల్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో పనిచేస్తుంది. ఈ విషయమై జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ చైర్మన్ ఆకాష్‌ అంబానీ మాట్లాడుతూ.. ‘జియో స్పేస్‌ ఫైబర్‌తో దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుంది. గిగాబిట్ యాక్సెస్‌తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలో భాగమవుతారు. దేశంలోని చాలా మంది తొలిసారి ఇంటర్‌నెట్ సేవలను పొందనున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ప్రపంచకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ పేరుతో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సేవలను త్వరలోనే భారత్‌లో కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రియల్స్‌ తీసుకురానున్న జియో స్పేస్‌ ఫైబర్‌ కూడా స్టార్‌ లింక్‌ను పోలి ఉంటుంది. ఇక ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ కూడా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..