రిసార్ట్‌లో చిరాకుతో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. కారణం ఏంటో తెలిస్తె అయ్యో పాపం అనాల్సిందే
జార్ఖండ్ అసెంబ్లీ లో బల పరీక్ష నేపథ్యం లో రేపు ఉదయం రిసార్ట్ నుండి నేరుగా రాంచీ కి వెళ్లి... అక్కడ నుండి నేరుగా అసెంబ్లీ కి తరలించనున్నారు. వచ్చి ముడు రోజులు అవుతుంది కాబట్టి బయటకి రాలేక పోవడం తో పాటు... వాతావరణ మార్పులు కారణంగా కొంత మంది ఎమ్మెల్యేలు నీరసంగా, చిరాకు గా కనిపిస్తున్నారు అట. రేపు ఏం జరుగుతుందొ అన్న టెన్షన్ కొంత మంది లో అయితే..

రిసార్ట్ రాజకీయం లో భాగంగా హైదరాబాద్ శామీర్ పేట్ లియొనియ రిసార్ట్ కి చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు. రెండు రోజుల తరవాత ఆదివారం రోజున చిరాకు గా ఉన్నారు అని సమాచారం.జార్ఖండ్ ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చడం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ కాంగ్రెస్. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యే లకు ఒక అబ్జర్వర్ తో పాటు పోలీసులు, నాయకుల తో మూడంచెల భద్రత నీ ఏర్పాటు చేశారు.
శుక్ర వారం, శని వారం ఎమ్మెల్యేలు కావాల్సిన ఫుడ్, స్పెషల్ రెసిపిస్ మంచిగా లగించారని టాక్. తెలంగాణ వంటకాలు,హైద్రాబాద్ స్పెషల్ ఫుడ్ వెజ్, నాన్ వెజ్ టేస్ట్ చేశారు. శుక్రవారం రిసార్ట్ చేరుకున్న ఎమ్మెల్యేలు మొదటి రెండు రోజులు అక్టివ్ గా గడిపిన ఆదివారం కొంత చిరాకు తో ఉన్నారని ఓ టాక్. వచ్చిన ఎమ్మెల్యేల్లో కొంత మంది మాత్రమే ఇప్పుడు ఆక్టివ్ తమ రూం లలో ఉన్నారని… మిగతా వారి అందరూ జ్వరం, బిపి లతో నీరసంగా, చిరాకుగా ఉన్నారని కొంత సమచారం.
సోమవారం జార్ఖండ్ అసెంబ్లీ లో బల పరీక్ష నేపథ్యం లో రేపు ఉదయం రిసార్ట్ నుండి నేరుగా రాంచీ కి వెళ్లి… అక్కడ నుండి నేరుగా అసెంబ్లీ కి తరలించనున్నారు. వచ్చి ముడు రోజులు అవుతుంది కాబట్టి బయటకి రాలేక పోవడం తో పాటు… వాతావరణ మార్పులు కారణంగా కొంత మంది ఎమ్మెల్యేలు నీరసంగా, చిరాకు గా కనిపిస్తున్నారు అట. రేపు ఏం జరుగుతుందొ అన్న టెన్షన్ కొంత మంది లో అయితే.. ఇంకా ఎంత సేపు ఇలా బయట ప్రాంతాల్లో ఇంట్లో వారికి దూరంగా ఉండాలని మరికొందరు.. దీంతో జ్వరం,బిపి ల తో రేపటి ప్రయాణ సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలుస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి