ఒక తాపీ మేస్త్రీ అల్ ఖైదాలో ఎలా సభ్యుడు అయ్యాడు? తీగ లాగితే రాంచీలో కదిలిన డొంక!

జార్ఖండ్‌లోని చాన్హో, లోహర్‌దగా జిల్లాల చాంద్వా సరిహద్దులో ఉన్న నకాటా పర్వతంలోని దట్టమైన అడవులలో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కొత్త మాడ్యూల్‌ను సిద్ధం చేయడానికి యువతకు బ్రెయిన్‌వాష్, శిక్షణ ఇవ్వడానికి కుట్ర పన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు వీలుగా నిందితులను పట్టుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు.

ఒక తాపీ మేస్త్రీ అల్ ఖైదాలో ఎలా సభ్యుడు అయ్యాడు? తీగ లాగితే రాంచీలో కదిలిన డొంక!
Al Qaeda Terrorist
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2025 | 7:32 PM

అల్ ఖైదా పేరు వినగానే మన మదిలో ఒక భయంకరమైన చిత్రం మెదులుతుంది. ఈ సంస్థ భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. అలాంటిది రోజువారీ కూలీగా పనిచేస్తున్న తాపీ మేస్త్రీ అల్ ఖైదా సభ్యుడిగా మారితే ఏమవుతుంది? అవును, జార్ఖండ్ రాజధాని రాంచీలో అలాంటిదే జరిగింది. అక్కడ ఒక తాపీ మేస్త్రీ అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థతో సంబంధం కొనసాగించాడు. అంతేకాదు అందులో చేరి సభ్యుడుగా మారిపోయాడు.

రాంచీలోని చాన్హో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న షాబాజ్ అన్సారీ, వృత్తిరీత్యా తాపీమేస్త్రీ, ప్రస్తుతం అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం అతన్ని రాజధాని రాంచీ నుండి అరెస్టు చేసింది. అక్కడ నుండి అతను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాలో చేరిన మొత్తం ప్రక్రియ గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చాడు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే.. కేవలం ఆరు నెలల్లోనే షాబాజ్ లాంటి చదువురాని వ్యక్తిని ఉగ్రవాద సంస్థలో చేర్చుకున్నారు.

రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న అల్ ఖైదా శిక్షణా శిబిరంలో మూడు రోజుల పాటు ఉగ్రవాద శిక్షణ తీసుకున్నట్లు షాబాజ్ అన్సారీ తెలిపాడు. ఈ సమయంలో, అతనితో పాటు మరో డజను మంది శిక్షణ తీసుకుంటున్నారు. షాబాజ్ ఇనాముల్ అన్సారీ అనే వ్యక్తితో స్నేహంగా ఉన్నాడని, అతను అల్ ఖైదాలో చేరడానికి తనను నిరంతరం ప్రేరేపించాడని చెప్పాడు. అతను కొన్ని నెలలపాటు బ్రెయిన్‌వాష్ అయ్యాడు. ఆ తర్వాత షాబాజ్ తన స్నేహితుడితో కలిసి ఢిల్లీకి ఆపై భివాడికి వెళ్ళాడు.

ఆగస్ట్ 24, 2024న, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం భివాడిలో ఉన్న శిక్షణా శిబిరంపై దాడి చేసింది. ఈ సమయంలో చాలా మంది అనుమానితులను అరెస్టు చేశారు. అయితే షాబాజ్ అన్సారీ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ దాడిలో అరెస్టయిన ఇతర అనుమానితుల్లో షాబాజ్‌ను ఉగ్రవాద సంస్థతో అనుసంధానించడానికి కారణమైన ఇనాముల్ అన్సారీ కూడా ఉన్నారు. మరోవైపు, జార్ఖండ్, ప్రత్యేకించి రాంచీ నుండి ఇప్పటివరకు చాలా మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిలో ప్రముఖులైన డా. ఇష్తియాక్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, ముఫ్తీ రహ్మతుల్లా మజిరి, ఫైజాన్ అహ్మద్, ఇనాముల్ అన్సారీ వంటి తీవ్రవాదులు ఉన్నారు. వీరి అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జార్ఖండ్‌లోని చాన్హో, లోహర్‌దగా జిల్లాల చాంద్వా సరిహద్దులో ఉన్న నకాటా పర్వతంలోని దట్టమైన అడవులలో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా కొత్త మాడ్యూల్‌ను సిద్ధం చేయడానికి యువతకు బ్రెయిన్‌వాష్, శిక్షణ ఇవ్వడానికి కుట్ర పన్నారు. అయితే, భద్రతా బలగాల సత్వరమే స్పందించంతో వారి ప్రణాళికలు విఫలమయ్యాయి. ఇప్పుడు ATS, ఢిల్లీ పోలీసు బృందాలు ఈ అనుమానితులపై దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. కాగా, జార్ఖండ్ ATS నకాటా పర్వతంలోని దట్టమైన అడవులలో గాలింపు చేపట్టింది. ఈ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్న అనుమానితులందరి గురించి కూడా సమాచారాన్ని సేకరిస్తోంది. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు వీలుగా నిందితులను పట్టుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..