జమ్ముకశ్మీర్‌లో హై అలర్ట్
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మరికొద్ది గంటలే ఉండటంతో.. జమ్ముకశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే లోయలో భద్రతాబలగాలు ఓ వైపు కూంబింగ్ చేపడుతూ.. మరోవైపు ఉగ్రవేట..
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మరికొద్ది గంటలే ఉండటంతో.. జమ్ముకశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే లోయలో భద్రతాబలగాలు ఓ వైపు కూంబింగ్ చేపడుతూ.. మరోవైపు ఉగ్రవేట కొనసాగిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల వద్ద సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు. జమ్ముకశ్మీర్ మీదుగా దేశంలోకి చొరబడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అలజడి సృష్టించేదుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సైన్యం వారి ప్లాన్లకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది.
కాగా, గత కొద్ది రోజులుగా లోయలో పెద్ద ఎత్తున ఉగ్రస్థావరాల గుట్టురట్టుచేసింది సైన్యం. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అంతేకాదు.. ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేస్తున్న ఉగ్రవాద సానుభూతి పరులను కూడా గురువారం నాడు అరెస్ట్ చేసింది.
Jammu and Kashmir: Security tightened in Jammu ahead of #IndependenceDay tomorrow. pic.twitter.com/LDyWRPqNB7
— ANI (@ANI) August 14, 2020
Read More :