రష్యాలో 9 లక్షల మార్క్‌ దాటిన పాజిటివ్‌ కేసులు

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి..

రష్యాలో 9 లక్షల మార్క్‌ దాటిన పాజిటివ్‌ కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 10:13 PM

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,12,823కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 7,22,964 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24గంటల్లో నమోదైన కేసులు 83 రీజియన్లలో నమోదైనవంటూ రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మాస్కోలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఇదిలావుంటే.. రష్యా కరోనా మహమ్మారికి విరుగుడు మందుల వ్యాక్సిన్‌ కనుగొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌పై అనేక దేశాలు అనుమానాలు రేపుతున్నప్పటికీ.. రష్యా మాత్రం మరో రెండు వారాల్లోగా తొలి బ్యాచ్‌కు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం