నాన్నగారు కోలుకుంటున్నారు.. ఆందోళన వద్దు

గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో...

నాన్నగారు కోలుకుంటున్నారు.. ఆందోళన వద్దు
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2020 | 10:32 PM

SP Balu Recovering :  గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్యం ఈ ఉదయం నుంచి కొంత ఆందోళనకరంగా మారింది. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నట్లుగా ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు.

అయితే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి చరణ్.. ఎవరూ కంగారు పడకండి.. త్వరితగతిన నాన్నగారు కోలుకుంటారు.. అని ట్వీట్ చేశారు.

‘‘నాన్నగారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎవరూ కంగారు పడకండి. త్వరితగతిన నాన్నగారు కోలుకుంటారు..’’ అని ఎస్.పి చరణ్ తెలిపారు.  ఇదే విషయం ఎస్.పి. బాలు సోదరి వసంత కూడా తెలియజేశారు.

‘‘అన్నయ్యకు ఆత్మస్థైర్యం ఉంది. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ప్రార్థనలతో ఆయన తప్పకుండా ఇంటికి క్షేమంగా వస్తారు. మధ్యాహ్నం అన్నయ్య ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది. ప్రస్తుతం కోలుకున్నారు. మీ అందరి ప్రార్థనలు ఆయనకి కొండంత అండ..’’ అని ఎస్.పి. బాలు సోదరి వసంత అన్నారు.

అయితే బాలు తనయుడు ఎస్.పి. చరణ్ మరో ట్వీట్ చేశారు. కొందరు నాన్న ఆరోగ్యంపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని.. కొంతమంది తప్పుడు వార్తలు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి . అందులో నిజం లేదు , నాన్న గారికి మెరుగయిన వైద్యం అందిస్తున్నారు వైద్యులు. అభిమానుల ఆశీస్సులతో తొందరలోనే కోలుకుంటారు.