‘రాధే శ్యామ్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబినేషన్‌లో 'రాధే శ్యామ్' సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య రాధే శ్యామ్..
Radhe Shyam Movie Latest Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కాంబినేషన్‌లో ‘రాధే శ్యామ్’ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య రాధే శ్యామ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. రాధే శ్యామ్ కథ పరంగా ఇందులో పూజా హెగ్డే డ్యూయల్ రోల్‌లో కనిపించనుందట. పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాని రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరోవైపు దీపికా పదుకొనేతో కలిసి ‘ప్రభాస్-21’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అశ్వనీదత్ సొంత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కున్న ఈ ప్రాజెక్టును సమారు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని సమాచారం.
Read More:
యూకే సంచలన నిర్ణయంః మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.3 ఫైన్!
ఈ నెల 17 నుంచి ఇంటర్ ఆన్‌లైన్ తరగతులు
బ్రేకింగ్ః కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా