పెళ్లిపీట‌లెక్క‌బోతున్న మ‌రో యంగ్ హీరో !

టాలీవుడ్​ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నార‌ని తెలుస్తోంది.​ ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెన‌క్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్‌ ట్వీట్ చేశాడు

పెళ్లిపీట‌లెక్క‌బోతున్న మ‌రో యంగ్ హీరో !
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2020 | 9:40 AM

టాలీవుడ్​ హీరో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లిపీట‌లెక్క‌బోతున్నార‌ని తెలుస్తోంది.​ ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను వెన‌క్కి తిరిగి చూసుకునేలా చేసిందని సందీప్‌ ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని ఇచ్చే అంశాల గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. త‌న జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ విష‌యాన్ని ఎక్కువ‌కాలం దాచుకోలేను. సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను అని సందీప్ కిషన్ ట్విట్టర్​లో వెల్ల‌డించాడు. ట్వీట్‌కు జ‌త‌గా మ్యాన్​ ఇన్​ లవ్​ స్టిక్క‌ర్‌ను జ‌త చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా​ త్వరలో మ్యారేజ్ చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని చెబుతున్నారు.

కాగా సందీస్ ప్ర‌స్తుతం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఆగిపోయింది. సందీప్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, నూత‌న ద‌ర్శ‌కుడు డెన్నీస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

Also Read : తోటి కోడళ్ల పంచాయితీ : ఏపీ, తమిళనాడులోని రెండు గ్రామాల వివాద‌మైంది