ఈడీ స్టేట్‌మెంట్‌పై అంకితా క్లారిటీ.. రీట్వీట్ చేసిన సుశాంత్ సోదరి

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విషయంలో లావాదేవీలకు

ఈడీ స్టేట్‌మెంట్‌పై అంకితా క్లారిటీ.. రీట్వీట్ చేసిన సుశాంత్ సోదరి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 10:20 AM

Ankita Lokhande on ED reports: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు విషయంలో లావాదేవీలకు సంబంధించి విచారణ చేస్తోన్న ఈడీ అధికారులు, శుక్రవారం కీలక విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోక్వాండే ఒకప్పుడు నివసించే ఫ్లాట్‌ సుశాంత్‌ పేరు మీద ఉందని, దాని ఈఎంఐలకు సంబంధించిన సుశాంత్ అకౌంట్ నుంచే కట్ అయ్యేవని ఈడీ అధికారి తెలిపారు. అయితే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చిన కాసేపటికే వాటిపై అంకితా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు.

నా మీద వచ్చిన వార్తలకు ఇదే నేనిచ్చే సమాధానం. పారదర్శకంగా వాటికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. నా ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్‌, అలాగే నా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ వివరాలు ఇవే. ప్రతి నెలా నా అకౌంట్‌ నుంచే డబ్బులు బ్యాంక్‌కి వెళ్లేవి. దీనికి మించి నేను ఏం చెప్పలేను అని పోస్ట్ చేశారు. దానికి జస్టిస్‌ ఫర్ సుశాంత్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ని ఇచ్చారు. ఇక అంకితా ట్వీట్లను సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కిర్తి సైతం రీట్వీట్ చేశారు.

Read More:

‘వందేమాతరం’: ఒక పాట.. వందమంది కంపోజర్లు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ