Good Luck  Sakhi Teaser:మన రాతను మనమే రాసుకోవాలా

మహానటి కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ తెరకెక్కించిన చిత్రం గుడ్‌లక్‌ సఖి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా

Good Luck  Sakhi Teaser:మన రాతను మనమే రాసుకోవాలా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 10:44 AM

Good Luck  Sakhi Teaser: మహానటి కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ తెరకెక్కించిన చిత్రం గుడ్‌లక్‌ సఖి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దురదృష్టవంతురాలంటూ ముద్ర పడ్డ ఓ యువతి షూటింగ్‌లో బంగారు పతక విజేతగా ఎలా ఎదిగింది అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో లంబాడీ తెగకు చెందిన యువతి పాత్రలో కీర్తి నటించింది. ఆది పినిశెట్టి డ్రామాల్లో నటించే వ్యక్తి పాత్రలో, జగపతి బాబు కోచ్‌గా నటించారు. వీరితో పాటు రమా ప్రభ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇక టీజర్‌లో కీర్తి మరోసారి చిలిపి చేష్టలు చేసే అమ్మాయి పాత్రలో అదరగొట్టేసింది. చూస్తేంటే ఈ మూవీ భావోద్వేగాలతో నిండినది ఉన్నట్లుగా ఉంది. అలాగే టీజర్‌కి దేవీ శ్రీ అందించిన సంగీతం, చిరంతన్‌ దాస్ అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలిచాయి. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు దర్శకుడు నగేష్ కుకునూర్‌. కాగా దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

ఈడీ స్టేట్‌మెంట్‌పై అంకితా క్లారిటీ.. రీట్వీట్ చేసిన సుశాంత్ సోదరి

‘వందేమాతరం’: ఒక పాట.. వందమంది కంపోజర్లు