‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్‌బాబు
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కొత్త సినిమాలు అంగీకరించే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే చిత్రాలు మాత్రమే చెయ్యాలని డిసైడయ్యారు.
Son Of India Movie : కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కొత్త సినిమాలు అంగీకరించే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే చిత్రాలు మాత్రమే చెయ్యాలని డిసైడయ్యారు. 560కి పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన ఈ లెజెండరీ యాక్టర్‌ని ఇంప్రెస్ చేసే కథలు రాయడమంటే మాములు విషయం కాదు. తాజాగా మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఆయన టైటిల్ రోల్ పోషించనున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 శనివారం ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అగ్రెసీవ్‌గా చూస్తోన్న మోహన్ బాబు లుక్ ఆకట్టుకుంటుంది. ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇంతవరకు తెలుగుతెరపై తెరకెక్కని ఓ నూతన కథాశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అలాగే పవర్‌ఫుల్ రోల్‌ను మోహన్‌బాబు పోషిస్తున్నారట. ఈ సినిమాకు పనిచేస్తున్న తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Announcing ‘SON OF INDIA’#SonofIndia#sonofindiatitleposter#HappyIndependenceDay pic.twitter.com/9K5R20EsEs
— Mohan Babu M (@themohanbabu) August 15, 2020