విజయమాల్యా జీవితంపై వెబ్‌సిరీస్
ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ మాల్యా లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ మాల్యా లైఫ్ స్టోరీ ఆధారంగా ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతుంది. ఇందుకు సంబంధించిన కథ కోసం నిర్మాణ సంస్థ అల్మైటీ మోషన్ పిక్చర్స్ ‘ది విజయ మాల్యా స్టోరీ’ పుస్తక రచయిత నుంచి హక్కులను కొనుగోలుచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు నటి, నిర్మాత ప్రబ్లీన్ కౌర్.
We @AlmightyMotion Picture are delighted to announce acquisition of the rights of ‘The Vijay Mallya Story’ written by renowned author @Gprakash1 & published by @PenguinIndia Soon to be a Mega Web Series! @vaishnavisngh @PZPictures pic.twitter.com/JhsSuXAL1z
— Prabhleen Kaur (@PrabhleenSandhu) August 13, 2020
‘ది విజయమాల్యా స్టోరీ’ బుక్‌ని ప్రముఖ రచయిత కే గిరిప్రకాశ్ రాయగా.. పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. విజయమాల్యా పుట్టిన దగ్గర నుంచి అతడు యూకే పారిపోయినంతవరకు సంబంధించిన వివరాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజీలో ఉంది. విజయమాల్యా రోల్ పోషించబోయే వ్యక్తి కోసం బాలీవుడ్లో వేట కొనసాగుతోంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది మూవీ యూనిట్. ఈ వెబ్‌సిరీస్‌ను ఎమ్ఎక్స్ ప్లేయర్లో రిలీజ్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది అల్మైటీ మోషన్ పిక్చర్స్ నిర్మాణసంస్థ.