కేరళలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులులగా నిత్యం వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి..
కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులులగా నిత్యం వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,569 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 26,996 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని కేరళ సీఎం కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,094 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలావుంటే.. సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కోజికోడ్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న అనేక మంది అధికారులకు కరోనా పాజిటివ్ సోకడంతో.. సీఎం పినరయ్ విజయన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
Read More :