మువ్వెన్నల రంగులతో జిగేల్‌ మంటున్న మహారాష్ట్ర

మహారాష్ట్రలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ.. కరోనా నిబంధనలకు లోబడి వేడుకలను నిర్వహించనుంది..

మువ్వెన్నల రంగులతో జిగేల్‌ మంటున్న మహారాష్ట్ర
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 10:47 PM

మహారాష్ట్రలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ.. కరోనా నిబంధనలకు లోబడి వేడుకలను నిర్వహించనుంది ప్రభుత్వం. ఇక ఇప్పటికే ముంబైలోని పలు భవనాలు మువ్వెన్నల రంగులతో అలకరించబడ్డాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్, బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బిల్డింగ్ వంటి పెద్ద పెద్ద భవంతులన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు. శనివారం జరగబోయే స్వాతంత్ర వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దేశంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తీర ప్రాంతంలో భద్రతను మరింత పెంచారు.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం