‘వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్’.. నేడే మోదీ కీలక ప్రకటన..!

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరో సంచలన పధకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ సంఖ్య మాదిరిగా ఆరోగ్య గుర్తింపు సంఖ్యను...

'వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్'.. నేడే మోదీ కీలక ప్రకటన..!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 15, 2020 | 1:57 AM

One Nation One Health Card: 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరో సంచలన పధకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ సంఖ్య మాదిరిగా ఆరోగ్య గుర్తింపు సంఖ్యను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలోనే నేడు ‘వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు’ స్కీంను ప్రకటించే అవకాశముంది. ఈ స్కీం కింద ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య సమాచారం, వైద్య చికిత్సలు, పరీక్షలు, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ కూడా డిజిటల్ ఫార్మటులో హెల్త్ కార్డులో పొందుపరుస్తారు.

సరిగ్గా ఆధార్ కార్డు లాగానే ఈ హెల్త్ కార్డును కూడా రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్డు కావాలని అనుకున్నవారికి యునిక్ ఐడీ జారీ చేయనున్నారు. దశల వారీగా ఈ పధకాన్ని అమలు చేయనుండగా.. కేంద్రం మొదటి దశలో భాగంగా రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించనుంది. కాగా, ఈ హెల్త్ కార్డు వల్ల భారతదేశంలో ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా.. వారు పేషెంట్ పూర్తి మెడికల్ డీటెయిల్స్ ను యునిక్ ఐడీ ద్వారా చూడగలుగుతారు.