ప్రధాని వర్సెస్ రాహుల్..రూ. 2 కోట్ల సూట్ ఫైట్
ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పౌరసత్వ సవరణ చట్టం చిచ్చు రగిల్చింది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఉదహరిస్తూ..జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిరసకారులెవరో వారు ధరించే దుస్తులను బట్టి చెప్పొచ్చంటూ కామెంట్ చేశారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాహుల్‌గాంధీ. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నిరసనకు దిగిన రాహుల్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో […]
ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పౌరసత్వ సవరణ చట్టం చిచ్చు రగిల్చింది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఉదహరిస్తూ..జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిరసకారులెవరో వారు ధరించే దుస్తులను బట్టి చెప్పొచ్చంటూ కామెంట్ చేశారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాహుల్‌గాంధీ.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నిరసనకు దిగిన రాహుల్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ధరించే దుస్తులను బట్టే ఆయనేంటో అర్థమవుతుందన్నారు. రెండు కోట్ల రూపాయల విలువైన సూట్ ధరించే మీరేంటో ప్రజలకు తెలుసు. సామన్యులు ధరించలేని దుస్తులవి అని కామెంట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం శత్రువుల వల్ల కూడా కాలేదని..కానీ ఆ పని ప్రధాని పదవిలో ఉండి మోదీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసిస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.