భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం..క్యూఆర్‌ఎస్‌ పరీక్ష విజయవంతం

భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన క్విక్‌ రియాక్షన్‌ ఎస్‌ పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే క్యూఆర్‌సామ్‌ క్షిపణిని..ఒడిశా చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి..సోమవారం విజయవంతంగా పరీక్షించింది భారత్‌. ఈ పరీక్ష లక్ష్యాలకు అనుగుణంగా సాగిందని, అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణి 2021 నాటికి సాయుధ దళాలలో చేరే అవకాశముందని తెలిపారు రక్షణ శాఖాధికారులు. పూర్తిగా ఆటోమేటెడ్‌ కంట్రోల్‌ కమాండ్‌ […]

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం..క్యూఆర్‌ఎస్‌ పరీక్ష విజయవంతం
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 24, 2019 | 4:07 PM

భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన క్విక్‌ రియాక్షన్‌ ఎస్‌ పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను చేధించే క్యూఆర్‌సామ్‌ క్షిపణిని..ఒడిశా చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి..సోమవారం విజయవంతంగా పరీక్షించింది భారత్‌. ఈ పరీక్ష లక్ష్యాలకు అనుగుణంగా సాగిందని, అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణి 2021 నాటికి సాయుధ దళాలలో చేరే అవకాశముందని తెలిపారు రక్షణ శాఖాధికారులు.

పూర్తిగా ఆటోమేటెడ్‌ కంట్రోల్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ క్షిపణి..గాల్లో ఉండగానే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. తాజాగా నిర్వహించిన ఈ పరీక్షలో గాల్లో ఉన్న లక్ష్యాన్ని పూర్తి సామర్థ్యంతో క్షిపణి ఢీకొన్నట్లు రక్షణశాఖాధికారులు తెలిపారు. డీఆర్డీవో డైరెక్టర్‌ జనర్‌ ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఈ పరీక్షను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ క్షిపణిలో అత్యంత శక్తివంతమైన రాడార్లు, కమాండ్, కంట్రోల్‌ వ్యవస్థలు ఉన్నాయని..క్షిపణి కదులుతున్న సమయంలోనే రాడార్లు శతృ లక్ష్యాలను గుర్తించగలుగుతాయని వెల్లడించారు. ఈ పరీక్షతో ఈ ఉపరితల క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలిపారు.