కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 16వ జనగణనకు ఆమోదం!
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్) కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న జాతీయ జనాభా పట్టికకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి వివరాలను రూపొందించేది జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్). ఈ డేటాబేస్‌లో ప్రతి ఒక్కరి వివరాలతో పాటుగా బయోమెట్రిక్స్‌ను కూడా పొందుపరుస్తారు. […]
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ జనాభా పట్టిక(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్) కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న జాతీయ జనాభా పట్టికకు కేంద్రం బడ్జెట్ కేటాయించింది. దేశంలో ఉన్న ప్రతీ పౌరుడి వివరాలను రూపొందించేది జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్). ఈ డేటాబేస్‌లో ప్రతి ఒక్కరి వివరాలతో పాటుగా బయోమెట్రిక్స్‌ను కూడా పొందుపరుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎన్‌పిఆర్ అనేది దేశంలో నివసిస్తున్న సాధారణ రెసిడెంట్స్ జాబితా అని అర్ధం. ఇక ఈ జాబితా కోసం కేంద్రం ఏకంగా రూ.8700 కోట్లను కేటాయించింది.
ఎన్ఆర్సీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. మొదట జాతీయ జనాభా పట్టిక(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్)ను రూపొందించి.. ఆ తర్వాత ఎన్ఆర్సీ అమలు చేయాలనీ కేంద్రం యోచిస్తోంది. మొదట ఈ జాతీయ పౌర పట్టికను 2010లో రూపొందించగా.. ఆ తర్వాత దాన్ని 2015 డోర్-టు-డోర్ సర్వే ద్వారా అప్డేట్ చేశారు. ఈ సమాచారానికి సంబంధించి డిజిటలైజేషన్ తాజాగా పూర్తయ్యింది. ఇక ఈ ప్రక్రియ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అదీ కూడా యాప్ ద్వారా జనాభా లెక్కలు జరుగుతాయని కేంద్ర మంత్రి జవదేకర్ స్పష్టం చేశారు. అయితే ఎన్ఆర్సీకి ఎన్‌పీఆర్‌కి మధ్య సంబంధం లేదని ఆయన తెలిపారు.
కేంద్ర కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు…
దేశవ్యాప్తంగా 16వ సారి జనగణనకు కేబినెట్ ఆమోదం..
ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2020 వరకు జనాభా లెక్కింపు..
జనాభా లెక్కల రిజిస్టర్‌లో వివరాలు నమోదుకు రూ.3,941 కోట్లు..
పేపర్ సాయం లేకుండా యాప్ ద్వారా జనాభా లెక్కింపు..
ఈ ప్రక్రియకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది…
అటల్ భూజల్ యోజన పథకానికి రూ.6000 కోట్లు కేటాయింపు…
త్రివిధ దళాల ఉమ్మడి చీఫ్ నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
4 స్టార్స్ కలిగిన జనరల్ ర్యాంక్ అధికారి చీఫ్‌గా వ్యవహరిస్తారు..
మిలటరీ ఎఫైర్స్ విభాగం కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్,. రక్షణశాఖలో సమన్వయం కోసం ఈ పదవిని ప్రకటించిన మోదీ…
అటల్ టన్నెల్ పథకానికి కూడా ఆమోదం…