రాహుల్, ప్రియాంక.. నో పర్మిషన్ టు ఎంటర్ మీరట్
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. యూపీ లో ఇప్పటికే ఈ కాల్పుల్లో మృతి చెందినవారి సంఖ్య 18 కి పెరిగింది. మీరట్ లో జరిగిన ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా-మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం ఈ నగరానికి చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీకి సుమారు 60 కి. మీ. దూరంలో ఉన్న […]
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. యూపీ లో ఇప్పటికే ఈ కాల్పుల్లో మృతి చెందినవారి సంఖ్య 18 కి పెరిగింది. మీరట్ లో జరిగిన ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా-మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం ఈ నగరానికి చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీకి సుమారు 60 కి. మీ. దూరంలో ఉన్న మీరట్ కు వీరిద్దరూ కేవలం కొద్దిమంది పార్టీ కార్యకర్తలతో మాత్రమే చేరుకున్నప్పటికీ.. పోలీసులు వారిని అనుమతించలేదు. మీరు ఈ నగరంలో ఎంటర్ కావడానికి పర్మిషన్ లేదని వారు ఖరాఖండిగా చెప్పగానే.. రాహుల్, ప్రియాంక గాంధీ చేసేది లేక తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. తమను ఎందుకు అనుమతించడం లేదన్న తమ ప్రశ్నకు పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాహుల్ ఆరోపించారు.