నీటిలో తేలియాడే శ్రీకృష్ణ టెంపుల్.. ఇస్కాన్ నిర్ణయం

2022 నాటికి దేశంలో 7 భారీ కృష్ణ మందిరాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌. సుమారు 2,100 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ మందిరాలను పలు ప్రత్యేకతలతో రూపొందించనున్నారు. వీటిలో బృందావనంతో పాటు బెంగళూరులో నిర్మించే ఆలయాలకు రూ. 1,500 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. బృందావన్ చంద్రోదయ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా ఉంటుంది. ఇది సుమారు 700 అడుగుల ఎత్తు ఉంటుంది. బెంగళూరు శ్రీ కృష్ణ లీలా థీమ్‌ […]

నీటిలో తేలియాడే శ్రీకృష్ణ టెంపుల్.. ఇస్కాన్ నిర్ణయం
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 23, 2019 | 4:21 PM

2022 నాటికి దేశంలో 7 భారీ కృష్ణ మందిరాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌. సుమారు 2,100 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ మందిరాలను పలు ప్రత్యేకతలతో రూపొందించనున్నారు. వీటిలో బృందావనంతో పాటు బెంగళూరులో నిర్మించే ఆలయాలకు రూ. 1,500 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. బృందావన్ చంద్రోదయ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా ఉంటుంది. ఇది సుమారు 700 అడుగుల ఎత్తు ఉంటుంది. బెంగళూరు శ్రీ కృష్ణ లీలా థీమ్‌ పార్క్‌ 450 అడుగుల పొడవుంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన ఆలయం. 46 అంతస్తులుండే ఈ టెంపుల్‌లో రాధాకృష్ణ ఆలయం పై అంతస్తులో ఉంటుంది. ఈ క్షేత్రానికి 7 ప్రవేశాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు 750 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.ఈ రెండు మందిరాల్లో కేవలం శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమే కాకుండా శ్రీకృష్ణుని లీలలకు సంబంధించిన విగ్రహాలతో పాటు వైకుంఠపురాన్ని కూడా నిర్మించన్నారు.

మైసూరు ఆలయానికి ‘వన బృందావన్ థామ్, జైపూర్‌లోని ఆలయానికి ‘శ్రీకృష్ణ బలరామ మందిరం,తెలంగాణలో నిర్మించే మందిరానికి ‘హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, అహ్మదాబాద్ ఆలయానికి ‘హరేకృష్ణ మందిరం, గౌహతిలోని మందిరానికి ‘ఫ్లోటింగ్ టెంపుల్ అనే పేర్లను పెట్టారు. గౌహతిలో నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. వరదలొచ్చినా మునిగిపోకుండా తేలియాడేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.