Inspiring Story Saalumarada Thimmakka: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ.. ప్రకృతి నుంచి ఆశించడమే కాదు.. ప్రకృతికి ఎంతోకంత చేయాలి.. అలా చేస్తేనే పుడమితల్లి పులకరిస్తుంది.. భవిష్యత్తు తరాలు పచ్చగా ఉంటాయి.. ఆ ఆలోచనలతోనే ఆమె ప్రకృతి ప్రేమించింది.. పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించింది.. ఇలా.. వేలాది మొక్కలకు తల్లయింది.. 112 ఏళ్ల జీవితకాలంలో 65 ఏళ్లు ఆమె మొక్కలు నాటడానికే అంకితమయ్యారంటే.. ఆమె ప్రకృతి సేవ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఆమె.. పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క .. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాలుమరద తిమ్మక్క.. పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషిచేసింది. తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో జన్మించిన తిమ్మక్క శ్రీ బిక్కల చిక్కయ్యను వివాహమాడారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో అంతా హేళన చేసిన పట్టించుకోలేదు.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.. ఇద్దరు కలిసి.. మొక్కలు నాటడం మొదలుపెట్టారు. వాటికి ఆయువు పోసారు మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి.. వేలాది వృక్షాలతో వనాన్నే ఏర్పాటు చేశారు. మర్రి చెట్ల పెంపకాన్ని మొదలుపెట్టిన తర్వాత నీళ్లు పోయ్యడం కోసం నాలుగు కిలోమీటర్ల వరకు ఎంతో కష్టపడి నీళ్లను మోసుకెళ్లేవారు.
సాధారణంగా మొక్కల పెంపకంపై దృష్టి పెట్టే వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే, ఈ వృద్ధురాలు మాత్రం ఏకంగా వేలాది మొక్కలను నాటి తన మంచి మనస్సును చాటుకున్నారు. పెళ్లై 20 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో మొక్కలను నాటి ఆ మొక్కలనే పిల్లల్లా పెంచుకుంటూ.. అందరికీ ఆదర్శంగా మారారు. 65 ఏళ్ల కాలంలో భర్త సహాయంతో వేలాది మర్రి చెట్లను, పలు రకాల వృక్షాలను నాటి.. ‘‘మదర్ ఆఫ్ ట్రీస్’’ గా ప్రసిద్ధి చెందారు. ఇప్పటి వరకు 8వేలకు పైగా మొక్కలు నాటి ‘మదర్ ఆఫ్ ట్రీ’గా పేరు తెచ్చుకోవడంతో భారత ప్రభుత్వం తిమ్మక్క సేవలను గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేసిన నిస్వార్థ సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో తిమ్మక్కను సత్కరించింది. కాగా.. పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరాద తిమ్మక్క నిన్న సాయంత్రం మంజునాథనగర్‌లోని తన నివాసంలో జారి పడ్డారు. దీంతో వెన్ను ఎముకకు గాయమైంది. జయనగర్ అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా.. భారత ప్రభుత్వం ప్రత్యేక పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ కోసం ‘‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్’’ అనే నినాదంతో చేపట్టిన ఉద్యమంలో టీవీ9 నెట్‌వర్క్ భాగస్వామ్యంగా ఉంది. ఈ ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఆదర్శ వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేస్తోంది టీవీ9..
మరిన్ని జాతీయ వార్తల కోసం..