కరోనా క్వారంటైన్ సెంటర్లో ‘టిక్‌టాక్’.. కేసు నమోదు..!

కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఆ క్వారంటైన్‌ సెంటర్లలో

కరోనా క్వారంటైన్ సెంటర్లో 'టిక్‌టాక్'.. కేసు నమోదు..!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 1:19 PM

కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఆ క్వారంటైన్‌ సెంటర్లలో సామాజిక దూరం పాటించాలని అధికారులు అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే వాటన్నింటిని బేఖాతరు చేస్తూ కనీస దూరం కూడా పాటించకుండా క్వారంటైన్‌లో టిక్‌టాక్‌ చేశారు కొందరు. ఈ ఘటన ఒడిశాలోని బద్రక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

అక్కడ తిహిడి హైస్కూల్‌లో క్వారంటైన్‌ సెంటర్ ఏర్పాటు చేయగా.. అందులో కరోనా లక్షణాలున్న అనుమానితులను ఉంచారు. అయితే ఏమి చేయాలో పాలుపోని వారు.. క్వారంటైన్ సెంటర్లో టిక్‌టాక్‌ వీడియోలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ వీడియోలపై బాటాపర పంచాయితీ సర్పంచ్‌.. దిహిడి పోలీస్‌ స్టేషన్‌లో ఏడుగురిపై ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని బద్రాక్ పోలీసులు తెలిపారు.

Read This Story Also: ఒకరి నుంచి 11 మందికి.. వనస్థలిపురంలో కేసులు ఎలా పెరిగాయంటే..!