Indigo Flight: ఫ్లైట్‌లో బాత్‌రూమ్‌కి వెళ్లి లాక్ వేసుకున్న ప్రయాణికుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Hyderabad, October 01: ప్రయాణం మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేస్తారు.. వాహనాన్ని ఓ పక్కకు ఆపి పని పూర్తి చేసుకుని వస్తారు. బస్సు, కారులో ప్రయాణిస్తే.. ఇలా ఆపుతాం. మరి..విమానం టాయిలెట్ వస్తే ఏం చేస్తాం. ఇంకేముందు.. అందులో టాయిలెట్ సౌకర్యం ఉంటుంది కాబట్టి.. అక్కడ రీఫ్రెష్ అవుతాం. కానీ, ఓ వ్యక్తి టాయిల్ పేరుతో విమానంలో నానా రచ్చ క్రియేట్ చేశాడు.

Hyderabad, October 01: ప్రయాణం మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేస్తారు.. వాహనాన్ని ఓ పక్కకు ఆపి పని పూర్తి చేసుకుని వస్తారు. బస్సు, కారులో ప్రయాణిస్తే.. ఇలా ఆపుతాం. మరి..విమానం టాయిలెట్ వస్తే ఏం చేస్తాం. ఇంకేముందు.. అందులో టాయిలెట్ సౌకర్యం ఉంటుంది కాబట్టి.. అక్కడ రీఫ్రెష్ అవుతాం. కానీ, ఓ వ్యక్తి టాయిల్ పేరుతో విమానంలో నానా రచ్చ క్రియేట్ చేశాడు. ఫ్లైట్ గమ్యస్థానం చేరుకునేంత వరకు అతను బయటకు రాలేదు. చివరకు విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానంలోకి ఓ ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందితో అనుచితంగా ప్రయాణించాడు. ఆన్‌బోర్డ్ టాయిలెట్‌లోకి వెళ్లి లాక్ వేసుకున్నాడు. విమానం పాట్నా చేరుకునే వరకు నానా హంగామా సృష్టించాడు. హైదరాబాద్‌లో విమానం ఎక్కాడు ఓ ప్రయాణికుడు. అతని వెంట అతని సోదరుడు కూడా ఉన్నాయి. అయితే, విమానం టేకాఫ్ అయిన తరువాత సదరు వ్యక్తి.. అనుచితంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇతరులతో ఘర్షణకు దిగడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చేశాడు. విమానంలో సిబ్బంది అతన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా.. అతను కంట్రోల్ అవ్వలేదు. చివరకు ఆన్‌బోర్డ్ టాయిలెట్‌లోకి వెళ్లి లాక్ వేసుకున్నాడు. ఎంతకీ డోర్ ఓపెన్ చేయలేదు. పాట్నాలో ల్యాండ్ అయిన తరువాత విషయాన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి తెలియజేశారు. దాంతో వారు వచ్చి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఫ్లైట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని, అతని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, పీటర్ మానసిక సమస్యలతో సతమతం అవుతున్నాడని నిర్ధారించారు. అతనికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీస్తున్నారు. ఒకవేళ అతను నిజంగానే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వదిలేసే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..