ఇండియాలో ఎత్తైన వ్యక్తి .. సాయం కోసం ఎదురుచూపు

లక్నో: దేశంలోనే అతి ఎత్తైన వ్యక్తిగా రికార్డుకెక్కిన వక్త తన జీవితం సాఫీగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తాను ప్రస్తుతం శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉందని వైద్యానికి ఖర్చుపెట్టేంత ఆర్ధిక స్థోమత తనకు లేదని బాధపడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ప్రపంచంలోని ఎత్తైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తన నడుముకు సర్జరీ చేయాల్సి ఉందని, దీనికోసం యూపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని కోరుతూ సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయానికి […]

ఇండియాలో ఎత్తైన వ్యక్తి .. సాయం కోసం ఎదురుచూపు
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 10:10 AM

లక్నో: దేశంలోనే అతి ఎత్తైన వ్యక్తిగా రికార్డుకెక్కిన వక్త తన జీవితం సాఫీగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తాను ప్రస్తుతం శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉందని వైద్యానికి ఖర్చుపెట్టేంత ఆర్ధిక స్థోమత తనకు లేదని బాధపడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ప్రపంచంలోని ఎత్తైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తన నడుముకు సర్జరీ చేయాల్సి ఉందని, దీనికోసం యూపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని కోరుతూ సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే ఆసమయంలో సీఎం అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు ఓ వినతిపత్రాన్ని ఇచ్చి అక్కడినుంచి వెనుదిరిగాడు. 8 అడుగుల 1 అంగుళాల పొడవైన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్‌ హిప్ జాయింట్ సర్జరీకి మొత్తం రూ. 8 లక్షలు ఖర్చవుతుంది. దీనిపై ఇప్పటికే తన చికిత్స కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. అందుకే సీఎం కార్యాలయానికి వచ్చినట్టుగా సింగ్ చెప్పాడు.

ఇదిలాఉంటే ధర్మంద్ర సింగ్‌ కంటే ముందు ఏపీకి చెందిన పొలిపాక గట్టయ్య 234 సెం.మీ (7 అడుగులు 6 అంగుళాలు) ఎత్తు కలిగిన ఎత్తైన వ్యక్తికి కూడా ఇలాంటి సమస్యే వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆయనకు ఉపాధిని కల్పించారు. రెండెకరాలు భూమి ఇస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. అయినప్పటికీ ఆయనకు గ్రామంలో ఒక ఇల్లు నిర్మించి ఇచ్చారు.

ప్రస్తుతం, టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. ఆయన ఎత్తు 251 సెం.మీ (8 అడుగులు 3 అంగుళాలు).