AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదే సస్పెన్స్ ! ఆశ్చర్యం !ముంబైలోని పార్క్ లో మరో మోనోలిథ్ ప్రత్యక్షం,

ముంబైలోని బాంద్రా శివార్లలో గల ఓ పార్కులో హఠాత్తుగా ఓ మోనోలిథ్ ప్రతక్షమైంది. జోగర్స్ పార్కుగా వ్యవహరించే ఈ ప్రాంతంలో ఈ మిస్టీరియస్ ఫలకం కనబడి అంతా ఆశ్చర్యపోయారు.

అదే సస్పెన్స్ !   ఆశ్చర్యం !ముంబైలోని పార్క్ లో మరో మోనోలిథ్ ప్రత్యక్షం,
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 11, 2021 | 10:48 AM

Share

ముంబైలోని బాంద్రా శివార్లలో గల ఓ పార్కులో హఠాత్తుగా ఓ మోనోలిథ్ ప్రతక్షమైంది. జోగర్స్ పార్కుగా వ్యవహరించే ఈ ప్రాంతంలో ఈ మిస్టీరియస్ ఫలకం కనబడి అంతా ఆశ్చర్యపోయారు. దీని గురించి స్థానిక కార్పొరేటర్ అసిఫ్ జకారియా ట్వీట్ చేస్తూ.. ఇది సుమారు 7 అడుగుల పొడవు ఉందని, దీని ఒక వైపున కొన్ని నెంబర్లు ఉన్నాయని తెలిపారు. అవి అర్థం కావడంలేదన్నారు. ట్రయాంగులర్ ప్రిజమ్ షేపులో ఉన్న ఈ ఫలకాన్ని చూసేందుకు ఈ గార్డెన్ కి పలువురు విజిటర్లు వస్తున్నారు. ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఈ మోనోలిథ్ పానెల్ లోని ఒకదానిపై కోడ్ నెంబర్లతో బాటు కొంత ఆ సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఫలకం జాడపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించలేదు. మొదట దీనిపై ఆరా తీయాల్సిఉంటుందన్నారు. ఈ గార్డెన్ చాల వరకు నిర్మానుష్యంగా ఉంటుందని, నిన్నటివరకు ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ లేదని వీరిలో ఒకరు తెలిపారు.

ఇండియాలో మొదట గత డిసెంబరులో గుజరాత్..అహమ్మదాబాద్ లో ఈ విధమైన మోనోలిథ్ కనబడింది. దాని కింద ఎలాంటి తవ్విన గుర్తులు కనబడలేదు. ఆ పార్క్ సంరక్షకుడు కూడా ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని, తాను ఉదయం లేచి వచ్చి చూసేసరికి ఇది కనబడిందని చెప్పాడు. ఆ నగరంలో..అందరూ రోజూ వచ్చే పార్కులోనే ఈ ఫలకం కనబడింది. ఈ మిస్టీరియస్  మోనోలిత్ ల వ్యవహారమేమిటో అధికారులకు కూడా అంతు బట్టడంలేదు. వీటిని పార్కుల్లో ఏర్పాటు చేయడానికి ఎవరు ‘ఉద్యమిస్తున్నారో’ ఇందువల్ల వారికి కలిగే ప్రయోజనమేమిటో వారికి అర్థం కావడంలేదు. కేవలం  నేచర్, పర్యావరణ పరిరక్షణకు ఈ పొడవాటి ఫలకాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారన్నది ఇప్పటివరకు అంతుబట్టలేదు. india's second mysterious monolith appear in mumbai park, mumbai, park, monolith, second, 7 feet high,  numbers, code, ahmadabad, park మరిన్ని చదవండి ఇక్కడ :

సచిన్ టెండూల్కర్ ప్రాంక్.. హడలిపోయిన డాక్టర్.. వైరల్ గా మారిన వీడియో : Sachin Tendulkar Pranks On Doctor Video.

1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, మంట రేపుతున్న వంటగది రేట్లు : Ginger and Egg High Prices Video

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త..ఇండియాలో భారీగా తగ్గిన ఆపిల్ ఫోన్ ధరలు..!:Iphone Price In India Video

Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..