India’s Largest Egg: వామ్మో! ఎంత పె..ద్ద.. కోడి గుడ్డు.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
కోడి గుడ్డు సాధారణంగా ఎంత సైజులో ఉంటుంది? మహాఐతే బాతు గుడ్డు కంటే కాస్త చిన్న సైజులో ఉంటుంది. ఐతే ఈ కోడి పెట్టిన గుడ్డు పరిమాణం చూస్తే మన కళ్ల గుడ్లు తేలేయడం ఖాయం. ఎందుకంటే అది ఏకంగా 210 గ్రాముల (దాదాపు పావు కిలో) బరువుంది మరి..
కోడి గుడ్డు సాధారణంగా ఎంత సైజులో ఉంటుంది? మహాఐతే బాతు గుడ్డు కంటే కాస్త చిన్న సైజులో ఉంటుంది. ఐతే ఈ కోడి పెట్టిన గుడ్డు పరిమాణం చూస్తే మన కళ్ల గుడ్లు తేలేయడం ఖాయం. ఎందుకంటే అది ఏకంగా 210 గ్రాముల (దాదాపు పావు కిలో) బరువుంది మరి. కొల్హాపూర్ జిల్లాలోని తల్సండే గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో ఉన్న హై-లైన్ డబ్ల్యూ-80 బ్లీడ్‌కి చెందిన కోడి ఇంత పె..ద్ద.. గుడ్డు పెట్టిందట. ప్రస్తుతం ఆ కోడి పెట్టిన గుడ్డు అందరినీ అమితాశ్చర్యాలకు గురి చేస్తోంది. బహుశా.. యావత్ దేశం మొత్తంలో ఇంత పెద్ద గుడ్డు.. బరువైన గుడ్డు.. పెట్టిన తొలి కోడి ఇదే కావచ్చని పలువురు అంటున్నారు.
పౌల్ట్రీ ఫారం యజమాని దిలీప్ చవాన్ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి కోళ్ల ఫారంలో నాకు ఓ పెద్ద గుడ్డు కనిపించి. దాన్ని చూడగానే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే గత 40 ఏళ్లుగా కోళ్ల ఫారం వ్యాపారం చేస్తున్నాను. ఇంత పెద్ద గుడ్డు నేను మునుపెన్నడూ చూడలేదు. తొలుత గుడ్డు సైజుని స్కేల్‌తో కొలిచి, ఆ తర్వాత బరువు చూశాను. ఆదివారం 200 గ్రాముల బరువుంది. సోమవారం మళ్ళీ క్రాస్ చెక్ చేయగా 210 గ్రాముల బరువు ఉండటం గమనించాను. ఆ తర్వాత మూడు వేర్వేరు తూకాల్లో బరువు చూడగా 210 గ్రాముల బరువునే చూపాయని తెలిపాడు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన గుడ్డు..
గతంలో 162 గ్రాముల బరువుతో పంజాబ్‌లోని ఓ కోడి పెట్టిన గుడ్డు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ రికార్డు కూడా బ్రేక్ చేసినట్టైంది. సాధారణంగా కోడి గుడ్లు 54 నుంచి 100 గ్రాముల వరకు బరువు ఉంటాయి. కొన్ని గుడ్లు 140 గ్రాముల వరకు కూడా బరువుంటాయి. ఐతే తాజాగా కొల్హాపూర్ పొలంలో హై-లైన్ డబ్ల్యూ-80 బ్లీడ్ కోడి పెట్టిన భారీ గుడ్డులో 3, 4 పచ్చ సొనలు ఉండే అవకాశం ఉందని పౌల్ట్రీ నిపుణులు అంటున్నారు.