Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ‘రిగ్గింగ్’ వివాదం.. ఎన్నికల ఛైర్మన్‌కు థరూర్ ప్రతినిధి ఫిర్యాదు..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వెల్లడించడం ఆ పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ కూడా జరిగిందని ఆరోపిస్తూ..

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ‘రిగ్గింగ్’ వివాదం.. ఎన్నికల ఛైర్మన్‌కు థరూర్ ప్రతినిధి ఫిర్యాదు..
Congress President Election Result
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2022 | 12:57 PM

మల్లికార్జున్ ఖర్గే.. శశి థరూర్.. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎవరన్నది మరికాసేపట్లో తేలనుంది. ఏఐసీసీ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 24 ఏళ్ల తర్వాత మొదటిసారి గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటంతో.. అంతటా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలోనే.. అధ్యక్ష రేసులో ఉన్న శశిథరూర్‌ ఏజెంట్ సంచలన కామెంట్స్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ వెల్లడించడం ఆ పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ కూడా జరిగిందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి శశి థరూర్ ఏజెంట్‌ సల్మాన్‌ సోజ్‌ ఫిర్యాదు చేశారు. అలాగే అక్రమాలకు సంబంధించి ఫోటోలు, ఆధారాలను కూడా సమర్పించారు. మల్లికార్జున ఖర్గే ఎన్నిక లాంఛనమే అని పార్టీ వర్గాలు భావిస్తున్న వేళ.. శశిథరూర్‌ కు ఎజెంట్‌గా ఉన్న నేత ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా.. దీనిపై పరస్పర ఆరోపణలు కూడా మొదలయ్యాయి. సోజ్ బీజేపీ భాష మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఆయనపై మండిపడ్డారు. దీనిపై కూడా సల్మాన్‌ సోజ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. యూపీ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీ మాత్రం అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు.

137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో..

137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. 1939, 1950, 1977, 1997, 2000 సంవత్సరాల్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 9,500 మందికి పైగా ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో.. మల్లిఖార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీలో నిలిచారు. అత్యంత ఆసక్తికరంగా కొనసాగిన కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల్లో.. అగ్రనేతలు స్పష్టంగా ఖర్గేకి మద్దతుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం.. ఖర్గేకు కలిసివచ్చే అంశాలుగా పరిగణిస్తున్నారు. అటు గాంధీ కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికాసేపట్లో ఫలితం వెల్లడించనున్న నేపథ్యంలో శశిథరూర్ వర్గం ఆరోపణలు.. పార్టీలో కలకలం రేపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!