PM Modi: ఒకప్పుడు పావురాలు.. ఇప్పుడు చీతాలు.. తేడా అదే.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఫెన్స్‌ ఎక్స్‌ పో 2022 బుధవారం ప్రారంభించారు. గుజరాత్‌‌లోని గాంధీనగర్‌లో ఢిఫెన్స్ ఎక్స్ పో నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చూట్టారు.

PM Modi: ఒకప్పుడు పావురాలు.. ఇప్పుడు చీతాలు.. తేడా అదే.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..
PM ModiImage Credit source: ANI
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2022 | 12:21 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఫెన్స్‌ ఎక్స్‌ పో 2022 బుధవారం ప్రారంభించారు. గుజరాత్‌‌లోని గాంధీనగర్‌లో ఢిఫెన్స్ ఎక్స్ పో నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చూట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నేటినుంచి గుజరాత్‌లో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర గుజరాత్‌లోని దీసాలో కొత్త ఎయిర్ బేస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక అంటూ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ ఉత్పత్తి సామర్ధ్యాలను ప్రదర్శించడం దీని ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఎక్స్ పోలో కేవలం భారతదేశానికి చెందిన కంపెనీలు మాత్రమే పాల్గొంటున్నాయని.. మన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. దీనిలో భారత్ సరికొత్త ముఖచిత్రం కనిపిస్తుందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం చాలా ముందుకు వచ్చిందని.. ఇంతకు ముందు పావురాలను విడిచిపెట్టాం.. ఇప్పుడు చిరుతలను వదులుతున్నామంటూ పేర్కొన్నారు. దిగుమతి కోసం నిషేధించబడే 101 వస్తువుల జాబితాను విడుదల చేయడానికి రక్షణ దళాలు సన్నాహాలు చేశాయన్నారు. దీనితో 411 రక్షణ సంబంధిత వస్తువులను స్థానికంగా కూడా కొనుగోలు చేయవచ్చవచ్చన్నారు. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గత ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇందులో దేశాభివృద్ధి, రాష్ట్రాల భాగస్వామ్యం, యువత కలలు కూడా ఉన్నాయని తెలిపారు. మొట్టమొదటిసారి భారత నేలలో రక్షణాయుధాలు తయారయ్యాయని తెలిపారు. మన దేశ కంపెనీలు, శాస్త్రవేత్తలు, యువత శక్తి, సర్ధార్ పటేల్ గడ్డ నుంచి ఈరోజు మన సత్తా ప్రపంచానికి చాటిచెబుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ తొలిసారిగా 450కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..