India’s Defence Budget: అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. 12ఏళ్లలో రక్షణ శాఖ బడ్జెట్ ఎంత పెరిగిందో తెలుసా..?
అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు.. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధితోపాటు అభివృద్ధికి దోహదపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రంగాలు మరింత పటిష్టంగా మారాయి.. ఆత్మ్ నిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారతదేశం) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. రక్షణ శాఖను మరింత పటిష్టంచేసింది..

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు.. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధితోపాటు అభివృద్ధికి దోహదపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రంగాలు మరింత పటిష్టంగా మారాయి.. ఆత్మ్ నిర్భర్ భారత్ అభియాన్ (స్వావలంబన భారతదేశం) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే.. రక్షణ శాఖను మరింత పటిష్టంచేసింది.. ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 2013-14లో రూ.2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్.. 2025-26లో రూ. 6.81 లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు X లో కీలక పోస్ట్ చేసింది.
The defence budget increased from Rs 2.53 lakh crore in 2013-14 to Rs 6.81 lakh crore in 2025-26. Strategic reforms, private sector participation, and innovation have boosted indigenous manufacturing, making India a self-reliant, globally trusted defence exporter while… pic.twitter.com/g8L56K3eNU
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 13, 2025
‘‘2013-14లో రూ. 2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ 2025-26లో రూ. 6.81 లక్షల కోట్లకు పెరిగింది. వ్యూహాత్మక సంస్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం – ఆవిష్కరణలు స్వదేశీ తయారీని పెంచాయి.. భారతదేశాన్ని స్వావలంబన దిశగా.. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ రక్షణ ఎగుమతిదారుగా మార్చాయి.. అదే సమయంలో జాతీయ భద్రత – ఆర్థిక వృద్ధిని బలోపేతం చేశాయి.’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ X లో తెలిపింది.
India’s #DefenceExports surged from Rs 686 crore in 2013-14 to Rs 23,622 crore in 2024-25, a 34-fold increase. In 2024-25, private sector exports were Rs15,233 crore, and DPSUs Rs 8,389 crore, with DPSU exports growing 42.85%. Export authorisations rose by 16.92%, and exporters… pic.twitter.com/yDVYAwajxG
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) May 13, 2025
‘‘భారతదేశ రక్షణ ఎగుమతులు 2013-14లో రూ. 686 కోట్ల నుండి 2024-25లో రూ. 23,622 కోట్లకు పెరిగాయి.. ఇది అప్పటి నుంచి 34 రెట్లు పెరిగింది. 2024-25లో, ప్రైవేట్ రంగ ఎగుమతులు రూ. 15,233 కోట్లు, DPSUలు రూ. 8,389 కోట్లు, DPSU ఎగుమతులు 42.85% పెరిగాయి. ఎగుమతి అధికారాలు 16.92% పెరిగాయి, ఎగుమతిదారులు 17.4% పెరిగారు. భారతదేశం అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియాతో సహా 100+ దేశాలకు ఎగుమతి చేస్తుంది.. 2029 నాటికి రూ. 50,000 కోట్ల ఎగుమతులను లక్ష్యంగా చేసుకుంది.. ఇది దాని ప్రపంచ రక్షణ తయారీ బలోపేతం చేశాయి.’’ అని మరో ట్వీట్ లో తెలిపింది.
ఆదివారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. newsonair.gov.in ప్రకారం , బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ ఫెసిలిటీ ప్రారంభం భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. 1998లో ఈ రోజున, అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో, శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారతదేశ బలాన్ని ప్రపంచానికి చూపించారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి