Chandrababu: ఆ ప్రార్థన మందిరాల కూల్చివేతను నిలిపివేయండి.. సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు..
ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలంలో ప్రార్థన మందిరాల కూల్చివేతను నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు, ప్రార్థనా మందిరం తొలగింపు ప్రతిపాదన అంశంపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయలకు విరుద్దంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించారు.

ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలంలో ప్రార్థన మందిరాల కూల్చివేతను నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీ ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు, ప్రార్థనా మందిరం తొలగింపు ప్రతిపాదన అంశంపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయలకు విరుద్దంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించారు. ప్రార్థన మందిరాల పట్ల సంయమనం పాటించాలన్న చంద్రబాబు.. ప్రజల మనోభావాలు దెబ్బతినే చర్యలుతీసుకోవద్దని సూచించారు. అయితే.. సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో ఆక్రమణల తొలగింపు ఆగిపోయింది.
రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ భవన్ స్థలాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు అవసరమైన చర్యలను ఏపీ యంత్రాంగం చేపట్టింది. ఏపీ భవన్ ప్రాంగణంలో 0.37 ఎకరాల్లో పలు ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అక్రమాల తొలగింపునకు గత నెల నుంచి తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు అదే ప్రాంతంలో ఉన్న రెండు ప్రార్థనా మందిరాలను కూడా తొలగించాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రజల, మత సంస్థల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు
అక్కడ స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేవాలయం తొలగింపు విషయంలో అభ్యంతరాలపై అధికారులను సీఎం చంద్రబాబు వివరణ కోరారు. ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి సూచనలతో సోమవారమే నిర్మాణాల తొలగింపు ప్రక్రియను నిలిపివేశామని అధికారులు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..