Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..

Andhra: తెల్లారి గుడికి వెళ్లి దేవుడ్ని మొక్కారు.. తీరా తిరిగి ఇంటికి వచ్చేసరికి..

Ravi Kiran

|

Updated on: May 13, 2025 | 6:17 PM

ఉదయాన్నే దేవుడ్ని మొక్కేందుకు గుడికి కుటుంబ సమేతంగా వెళ్లాడు ఓ వ్యక్తి. ఇలా గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో తెలిస్తే.. ఠక్కున దడుసుకుంటారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

అన్నమయ్య జిల్లా పీలేరు గ్రామంలోని చెన్నారెడ్డి వీధిలో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 100 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు చోరీ చేశారు దుండగులు. శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఉదయం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేలోపు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. కాగా, ఈ ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని మేరకు దర్యాప్తు చేపట్టారు.