Monsoon: అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఈ సారి భారీగా వర్షాలు!
Monsoon: ఐఎండీ అంచనా వేసినట్టుగానే దక్షిణ అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు రోజులు ముందుగానే రుతుపవనాల అగమానం ఉందని, రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో మధ్య బంగాళా ఖాతంలోకి రుతుపవనాలు..

అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. దక్షిణ అండమాన్, నీకొబార్ దీవుల్లో ఋతుపవనాలు కేంద్రికృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి మరింత విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మూడు, నాలుగు రోజుల్లో మధ్య బంగాలా ఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళకు తాకనున్నాయని వెల్లడించారు. అయితే ఈ సారి వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తూర్పు యూపీ బీహార్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, దక్షిణ ఒడిస్సా తీరం వరకు ఉపరితల ద్రోణి కారణంగా ఏపీకి ఐదు రోజులపాటు చెదురు మదురు వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. కోస్తాలో ఈరోజు తేలికపాటి వర్షాలు.. రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధకుమార్ టీవీ9తో తెలిపారు.
ఐఎండీ అంచనా వేసినట్టుగానే దక్షిణ అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు రోజులు ముందుగానే రుతుపవనాల అగమానం ఉందని, రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో మధ్య బంగాళా ఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ నెలాఖరుకు కేరళ తీరని రుతుపవనలు తాకుతాయన్నారు. ఆ తర్వాత ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు.
రాబోయే వారం రోజుల్లో ఏపీలో చెదురు మదురు వర్షాలు.. ఉత్తరకొస్తాలో ఒకటి చెట్ల భారీ వర్షాలు.. కోస్తాలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షాలు ఉంటాయనిజగన్నాధకుమార్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి