AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత ఏడు దశాబ్దాల్లో పాక్‌పై భారత్ చేపట్టిన 10 కీలక సైనిక ఆపరేషన్లు ఇవే!

భారత్ అన్నంత పని చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలు లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది. 100 మందికిపైగా ఉగ్రవాదులను సమాధి చేసి పాక్‌ను షాక్‌కు గురిచేసింది. దీంతో పాకిస్తానీలు వణికిపోతున్నారు. యుద్ధభయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో... భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న ఆందోళనతో బిక్కచచ్చిపోతున్నారు.

గత ఏడు దశాబ్దాల్లో పాక్‌పై భారత్ చేపట్టిన 10 కీలక సైనిక ఆపరేషన్లు ఇవే!
India's Military Operations
Balaraju Goud
| Edited By: |

Updated on: May 12, 2025 | 6:49 PM

Share

జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. వీటికి దీటుగా స్పందిస్తున్న భారత్‌.. ప్రతీకార దాడులతో బుద్ధి చెబుతున్నప్పటికీ దాయాది దేశం తీరు మారడం లేదు. ఇటీవల పహల్గామ్‌లోనూ అమాయకులైన పర్యటకులపై ఊచకోతకు పాల్పడింది. ప్రతీకారంగా పాక్‌ ఉగ్ర స్థావరాలపై భారత్‌ విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో దాడిచేసి పదుల సంఖ్యలో ముష్కర మూకలను మట్టుపెట్టింది. ఈ నేపథ్యంలో గత ఏడు దశాబ్దాల్లో పాక్‌పై మనం చేపట్టిన 10 కీలక సైనిక ఆపరేషన్లను పరిశీలిద్దాం.. 1. ఆపరేషన్ రిడిల్ (1965 ఇండో-పాక్ యుద్ధం) కశ్మీర్‌ను ఆక్రమించాలనుకునే ఉద్దేశంతో 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ అండ్‌ గ్రాండ్ స్లామ్ అనే కోడ్‌తో పాకిస్తాన్ ప్రారంభించిన దాడికి భారత సైన్యం ప్రతిస్పందనగా ఆపరేషన్ రిడిల్ చేపట్టింది. పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LOC)ని ఉల్లంఘించి జమ్ము కశ్మీర్‌లోకి ప్రవేశించడంతో, భారతదేశం సెప్టెంబర్ 6, 1965న పాకిస్తాన్‌లోని లాహోర్‌తో పాటు కసూర్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2. ఆపరేషన్ అబ్లేజ్ (1965 ఇండో-పాక్ యుద్ధం) ఆపరేషన్ అబ్లేజ్ కూడా 1965 ఇండో-పాక్ యుద్ధం సందర్భంలోనే జరిగింది. పశ్చిమ సరిహద్దులో రక్షణాత్మక వ్యూహంగా ప్రారంభించిన ఆపరేషన్ అబ్లేజ్, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో, ముఖ్యంగా రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఘర్షణల తర్వాత ఏప్రిల్ 1965లో భారత సైన్యం ముందస్తు సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ఇది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి