AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు స్వల్ప ఊరట.. ఛార్జీల పెంపుపై కేంద్రమంత్రి క్లారిటీ!

రైల్వే ప్రయాణికులకు కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలో రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్టు ఇటీవలే రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న స్పందించారు. ప్రయాణికులపై ప్రభావం పడకుండా దశలవారీగా ఈ ఛార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు స్వల్ప ఊరట.. ఛార్జీల పెంపుపై కేంద్రమంత్రి క్లారిటీ!
Train
Anand T
|

Updated on: Jun 28, 2025 | 8:19 AM

Share

రైల్వే ప్రయాణికులకు కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలో రైల్వే ఛార్జీలను స్వల్పంగా పెంచబోతున్నట్టు ఇటీవలే రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో దీనిపై కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ప్రయాణికులపై ప్రభావం పడకుండా దశలవారీగా టికెట్‌ ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. ఒక్కసారిగా ఛార్జీల పెరుగుదల ఉండకపోవచ్చని.. క్రమంగా క్రమంగా ఈ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై ఇంకా చర్చ జరుగుతోందని, టికెట్‌ ధరలను దశల వారీగానే పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా చెన్నైకి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదన నేపథ్యంలో పరందూర్‌లో రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టే అంశంపై ఆయన స్పందించారు. ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు మంత్రి సోమన్న తెలిపారు.

భారతీయ రైల్వే శాఖ రైలు టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచాలని నిర్ణయించినట్లు.. ఈ కొత్త ఛార్జీలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు ఇటీవల కొన్ని నేవికలు తెలిపాయి. అయితే ఛార్జీల పెరుగుదల నాన్-ఎసి మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ల టికెట్ ధర కిలోమీటరుకు 1 పైసా, ఎసి క్లాస్‌ టికెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు పెరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, సెకండ్ క్లాస్ బోగీలలో 500 కిలోమీటర్ల వరకు ధరలు ఎలాంటి ఛార్జీల పెరుగదల ఉండకపోవచ్చని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..