AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న రెస్టారెంట్‌లు.. ఎక్కడంటే..?

ఎప్పటికప్పుడు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న ఇండియన్ రైల్వేస్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులకుప్రత్యేక అనుభూతిని కల్పించేందుకు..

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న రెస్టారెంట్‌లు.. ఎక్కడంటే..?
Restaurant On Wheels
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2022 | 2:02 PM

Share

ఎప్పటికప్పుడు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్న ఇండియన్ రైల్వేస్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులకుప్రత్యేక అనుభూతిని కల్పించేందుకు.. బోగిల్లో రెస్టారెంట్ల మాదిరిగా ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు వస్తోంది. త్వరలో మహారాష్ట్రలోని మరో నాలుగు స్టేషన్లలో ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ ను ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ఉన్న రెండు సౌకర్యాలు కాకుండా, సవరించిన కోచ్‌లో డైనర్‌లకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని తెలిపింది. సెంట్రల్ రైల్వే అటువంటి రెస్టారెంట్‌లను గత సంవత్సరం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో, ఈ సంవత్సరం ప్రారంభంలో నాగ్‌పూర్ స్టేషన్‌లో నాన్ ఫేర్ రెవెన్యూ పథకం కింద మరొక రెస్టారెంట్‌ను ప్రారంభించింది.

ఈ పథకం కింద అకుర్ది, చించ్‌వాడ్, బారామతి (అన్నీ పూణే జిల్లాలో), మిరాజ్ (సాంగ్లీ) స్టేషన్‌లలో త్వరలో ఇలాంటి రెస్టారెంట్లు రానున్నాయని సెంట్రల్ రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. “రెస్టారెంట్ ఆన్ వీల్’ అనేది రైలు పట్టాలపై అమర్చిన ఒక కోచ్, ఇది డైనర్‌లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ కోచ్‌లో 40 మందికి పైగా ప్రయాణికులకు టేబుల్‌లతో వసతి కల్పిస్తుంది” అని రైల్వే అధికారులు తెలిపారు.

దీని ఇంటీరియర్‌లు ప్రజలు రైలులో ప్రయాణం చేసే మాదిరిగా ఉన్న సెట్టింగ్‌లో భోజన అనుభవాన్ని ఆస్వాదించే విధంగా సుందరంగా తీర్చిదిద్దనున్నారు. “రెస్టారెంట్ ఆన్ వీల్స్” ఉద్దేశ్యం రాబడి ఉత్పత్తికి సంబంధించిన వినూత్న ఆలోచనలతో ప్రయాణీకులకు సేవలందించడానికి అద్భుతమైన ఉదాహరణ అని రైల్వే పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు CSMT రెస్టారెంట్‌లో సుమారు 1.25 లక్షల మంది సందర్శకులు ఆహారం తిని ఆనందించారని సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఈ రెండు సౌకర్యాలు ప్రారంభించినప్పటి నుంచి 1.50 లక్షల మంది నాగ్‌పూర్‌లోని అవుట్‌లెట్‌ను సందర్శించారని తెలిపింది.

లోకమాన్య తిలక్ టెమినస్, దాదర్ (ముంబైలో), కళ్యాణ్ (థానే), లోనావాలా (పూణే), ఇగత్‌పురి (నాసిక్), నేరల్, మాథెరన్ (రాయ్‌గఢ్ జిల్లాలో) – ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి మరో ఏడు ప్రదేశాలను గుర్తించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..