మిగ్‌-27పై మోడీ మార్క్ నిర్ణయం.. దీంతో…

యుద్ధం వస్తే.. సైన్యంతో పాటు.. వైమానిక దళం కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇందులో అనేక రకాల యుద్ధ విమానాలు ఉన్నా.. అత్యంత కీలకంగా వ్యవహరించే విమానాలు కొన్ని ఉంటాయి. అందులో మిగ్ యుద్ధవిమానాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైన యుద్ధవిమానాలు. అందులో మరీ ముఖ్యంగా మిగ్-27ది ప్రత్యేకమైన పాత్ర. ఈ మిగ్ యుద్ధవిమానాలు భారత్ వాయుసేనలో కీలక పాత్ర పోషించాయి. మిగ్-27 యుద్ధవిమానాలైతే.. దేశానికి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల […]

మిగ్‌-27పై మోడీ మార్క్ నిర్ణయం.. దీంతో...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 27, 2019 | 6:16 PM

యుద్ధం వస్తే.. సైన్యంతో పాటు.. వైమానిక దళం కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇందులో అనేక రకాల యుద్ధ విమానాలు ఉన్నా.. అత్యంత కీలకంగా వ్యవహరించే విమానాలు కొన్ని ఉంటాయి. అందులో మిగ్ యుద్ధవిమానాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైన యుద్ధవిమానాలు. అందులో మరీ ముఖ్యంగా మిగ్-27ది ప్రత్యేకమైన పాత్ర. ఈ మిగ్ యుద్ధవిమానాలు భారత్ వాయుసేనలో కీలక పాత్ర పోషించాయి. మిగ్-27 యుద్ధవిమానాలైతే.. దేశానికి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఈ మిగ్-27 యుద్ధవిమానాలు భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషించాయి. 1999 నాడు.. పాక్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధం సందర్భంగా ఆపరేషన్ సేఫ్‌డ్ సాగర్‌లో ఈ మిగ్ -27 యుద్ధవిమానాలు కీలకంగా వ్యవహరించాయి. అప్పటినుంచి భారత వైమానిక దళంలో వీటిని బహుదుర్‌గా వ్యవహరిస్తారు.

అయితే ఇంతటి కీలక యుద్ధవిమానాలు ప్రస్థానం శుక్రవారంతో ముగిసింది. దాదాపు 38 ఏళ్ల పైగా అనేక సేవలందించిన మిగ్-27 యుద్ధవిమానాలకు ఐఏఎఫ్‌ ఘనంగా వీడ్కోలు పలికింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ వైమానిక స్థావరం నుంచి.. ఏడు మిగ్‌ -27 విమానాలు చివరిసారి ఆకాశంలోకి ఎగిరాయి. తుదిసారిగా ల్యాండింగ్‌ అయిన తర్వాత.. జల ఫిరంగుల ద్వారా వీటికి గౌరవ వందనం సమర్పించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానం ముగిసినట్లైంది. ప్రస్తుతం ఈ మిగ్-27 విమానాలు ఏ దేశంలోనూ వినియోగంలో లేవు.