రాహుల్ గాంధీ ఓ అబద్ధాల కోరు: ప్రకాష్ జవదేకర్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్) ను పేదలపై పన్ను పేర్కొన్నారు. అయితే.. పాలక బిజెపి “తన పార్టీని, కుటుంబాన్ని ఇబ్బందిపెట్టింది” అని రాహుల్ వ్యాఖ్యానించినందుకు.. “2019లో అతిపెద్ద అబద్ధాలకోరు” అని బీజేపీ రాహుల్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించింది. బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ దేశంలో అస్థిరతను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొత్త పౌరసత్వ చట్టం, ఎన్‌పిఆర్‌పై ప్రజలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పట్టుబట్టారు. “ఎన్‌పిఆర్ డేటా […]
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్) ను పేదలపై పన్ను పేర్కొన్నారు. అయితే.. పాలక బిజెపి “తన పార్టీని, కుటుంబాన్ని ఇబ్బందిపెట్టింది” అని రాహుల్ వ్యాఖ్యానించినందుకు.. “2019లో అతిపెద్ద అబద్ధాలకోరు” అని బీజేపీ రాహుల్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించింది. బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ దేశంలో అస్థిరతను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొత్త పౌరసత్వ చట్టం, ఎన్‌పిఆర్‌పై ప్రజలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పట్టుబట్టారు. “ఎన్‌పిఆర్ డేటా పేదలను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది, తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుకోగలవు” అని జవదేకర్ చెప్పారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అతను ఏదైనా మాట్లాడేవాడు, అబద్ధాలు కూడా మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా లేరు కాని అబద్ధాలు మాత్రం చెబుతూనే ఉన్నారు. ఒకప్పుడు అతని వ్యాఖ్యలు అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేవి.. కానీ ఇప్పుడు అతని అబద్ధాలు తన పార్టీని, దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి “అని జవదేకర్ వివరించారు.
రాహుల్ గాంధీ ఎన్‌పిఆర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)లను “పేద ప్రజలపై పన్ను” అని పేర్కొన్నారు. “పేద ప్రజలు అధికారుల వద్దకు వెళ్లి వారి పత్రాలు చూపించి లంచం ఇవ్వవలసి ఉంటుంది. వారి పేర్లలో స్వల్ప పొరపాటు జరిగితే వారు లంచం ఇవ్వవలసి ఉంటుంది. పేదల జేబుల్లోంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇది నిజం. ఇది ప్రజలపై దాడి “అని రాహుల్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్‌పిఆర్, అక్రమ వలసదారులను గుర్తించే ఎన్‌ఆర్‌సికి పూర్వగామిగా విమర్శకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థులు కొత్త పౌరసత్వ చట్టంతో పాటు ఎన్‌ఆర్‌సి ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి సాధనంగా ఉపయోగించబడుతుందని విమర్శించారు.