AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి వక్రబుద్ది చాటుకున్న డ్రాగన్.. కంత్రీ కంట్రీ చైనా తీరుపై భారత్ ఫైర్

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా మార్చింది. డ్రాగన్ కంత్రీ బుద్దిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది.

మరోసారి వక్రబుద్ది చాటుకున్న డ్రాగన్.. కంత్రీ కంట్రీ చైనా తీరుపై భారత్ ఫైర్
Arunachal Pradesh
Balaraju Goud
|

Updated on: May 14, 2025 | 10:38 AM

Share

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా మార్చింది. డ్రాగన్ కంత్రీ బుద్దిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది. భారతదేశం అటువంటి ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌దేశంలో భాగమేనని తేల్చి చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని తెలిపింది.

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేరు మార్చడానికి చైనా తన అసంబద్ధమైన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. సృజనాత్మకంగా పేరు మార్చడం వల్ల భారతదేశంలో అంతర్భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌ను విడదీయలేరని MEA ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వృథా, అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025 మే 11న అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రదేశాల పేర్లను మార్చింది. దీంతో ఆ జాబితా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో చైనా ఒక మ్యాప్‌ను కూడా జారీ చేసింది. మెక్‌మహాన్‌ను చట్టవిరుద్ధమని, చైనాలో విడదీయరాని భాగమని పేర్కొంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రెండు వారాల క్రితం చైనా 22 ప్రదేశాల పేర్లను మార్చిందని పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేర్లను చైనా గతంలో నాలుగుసార్లు మార్చింది. 2017లో 6 ప్రదేశాల పేర్లను మార్చింది. దీని తర్వాత, 2021లో 15 ప్రదేశాల పేర్లను మార్చారు. ఆ తరువాత 2023లో 11, 2024లో గరిష్టంగా 30 ప్రదేశాల పేర్లను మార్చారు. ఇందులో పర్వతాలు, నదులు, సరస్సులు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ పేర్లను చైనా “జాంగ్నాన్” అంటే దక్షిణ టిబెట్‌లో భాగంగా గుర్తించింది. చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలలో పేర్కొన్నారు.

చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లో భాగంగా పరిగణిస్తుంది. దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తూ వాదిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తనదిగా పేర్కొంటోంది. మరోవైపు, అరుణాచల్ తన అంతర్భాగమని, దానిపై భారతదేశ సార్వభౌమాధికారం అంతర్జాతీయంగా గుర్తించిందని భారతదేశం చెబుతోంది. అంతేకాకుండా, భారతదేశంలోని అక్సాయ్ చిన్ భూమిలో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్లను కూడా చైనా అక్రమంగా ఆక్రమించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..