India Covid-19 cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?
India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ.. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే
India Coronavirus cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ.. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా శనివారం 535 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,71,901 కి చేరగా.. మరణాల సంఖ్య 4,20,551 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి 39,972 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,43,138 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.30 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.
More than 45.37 crore (45,37,70,580) vaccine doses have been provided to States/UTs so far, through all sources and a further 11,79,010 doses are in the pipeline: Union Health Ministry pic.twitter.com/QoZVlBZDZH
— ANI (@ANI) July 25, 2021
దీంతోపాటు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 43,31,50,864 మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు 45 కోట్లకు (45,37,70,580) పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: