India Corona: దేశంలో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఎన్నడూ లేనంతగా..

India Corona: దేశంలో కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. నిన్న ఎన్నంటే..?
Coronavirus
Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Jan 17, 2022 | 1:14 PM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఎన్నడూ లేనంతగా.. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 385 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్నటితో పోల్చుకుంటే.. 13,113 కేసులు తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. వారం పాజిటివిటీ రేటు 14.41 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 1,51,740 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,53,37,461 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.27 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,73,80,253 కి చేరగా.. మరణాల సంఖ్య 4,86,451కి పెరిగింది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,209 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 6శాతం కేసులు పెరిగాయి.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 157.20 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 39 లక్షల డోసులు పంపిణీ చేశారు.

కాగా.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న 41,327 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 29 మంది ఈ మహమ్మారితో మరణించారు. ఢిల్లీలో ఆదివారం 18,286 కరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది మరణించారు.

Also Read:

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

PM Narendra Modi: నేడు ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం.. కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!