PM Narendra Modi: నేడు ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం.. కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని మోదీ
World Economic Forum: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ రోజు ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో
World Economic Forum: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ రోజు ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పరిస్థితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, వ్యాక్సినేషన్, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ అజెండాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి కూడా మోదీ వివరించనున్నారు.
వర్చువల్ ద్వారా జరిగే ఈ (World Economic Forum) కార్యక్రమం జనవరి 17 నుంచి 21 వరకు జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సువా వాన్ డెర్ లేయన్, ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్, ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో, ఇజ్రాయెల్ ప్రధానితో సహా పలువురు దేశాధినేతలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కూడా ప్రసంగిస్తారు. భారత కాలమానం ప్రకారం.. ఈ ఆర్థిక సదస్సు రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది.
వాస్తవానికి ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సును ఎప్పటిలాగే భౌతికంగా నిర్వహించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్ణయించింది. దీనికోసం ఏర్పాట్లు సైతం చేసింది. ఈ సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించడంతో దీన్ని రద్దు చేశారు. గతేడాది మాదిరిగానే వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ ష్క్వాబ్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: