Operation Sindoor: టార్గెట్ ఫిక్స్ చేస్తే పేలిపోవాల్సిందే.. భారత్ ఆర్మీ సంచలన వీడియో విడుదల..
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్‌ను హడలెత్తించింది.. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన భారత్.. మిస్సైళ్లతో విరుచుకుపడింది.. వాటన్నింటిని నేలమట్టం చేయడంతోపాటు.. దాదాపు 100 మంది ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టింది.

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్‌ను హడలెత్తించింది.. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన భారత్.. మిస్సైళ్లతో విరుచుకుపడింది.. వాటన్నింటిని నేలమట్టం చేయడంతోపాటు.. కీలక ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. చివరకు పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. అనంతరం ఇరుదేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి..ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వీడియోను విడుదల చేసింది..
వీడియో చూడండి..
#WATCH | Pakistani targets engaged and destroyed by the Indian Armed Forces during #OperationSindoor
(Video source: Ministry of Defence) pic.twitter.com/593BpawRaN
— ANI (@ANI) May 12, 2025
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేశాయి.. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ఉగ్రమూకల ఆటకట్టించింది. కచ్చితమైన సమాచారంతో టార్గెట్‌లను ధ్వంసం చేసినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని.. కేవలం ఉగ్రవాదులను మాత్రమే అంతం చేశామని పేర్కొంది.
వీడియో చూడండి..
#WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD
— ANI (@ANI) May 12, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..